సామజవరగమన చూస్తే నాన్ స్టాప్ గా నవ్వుతూనే వుంటారు : హీరో శ్రీవిష్ణు
శ్రీవిష్ణు కథానాయకుడిగా వివాహ భోజనంబు ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందుతున్నకంప్లీట్ ఎంటర్‌టైనర్ సామజవరగమన. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తునారు. ఈ సినిమాలో శ్రీవిష్ణు సరసన రెబా మోనికా జాన్ హీరోయిన్‌గా నటిస్తోంది. సరదాగా సాగే ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ ఈరోజు విడుదల చేశారు.
చిన్న విషయాలుకు కూడా చిరాకుపడే యువకుడిగా కనిపించాడు శ్రీవిష్ణు. కాలేజీ రోజుల్లో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ ఆమె అతనికి రాఖీ కడుతుంది. అప్పటి నుంచి అమ్మాయిలు తనకు ప్రపోజ్ చేసినప్పుడల్లా రాఖీ కట్టించుకుంటాడు. ప్రేమ పై నెగిటివ్ అభిప్రాయాన్ని పెంచుకుంటాడు. శ్రీవిష్ణు కామిక్ టైమింగ్ అద్భుతంగా ఉంది. అతని డైలాగ్స్, ఫ్రస్టేషన్ ఫ్రెష్ నెస్ ని తీసుకొచ్చాయి. బాత్రూమ్ సీక్వెన్స్, ఫోన్ కాల్ లో చివరి సీక్వెన్స్.. శ్రీవిష్ణు ఎంత మంచి నటుడో చూపిస్తున్నాయి. రెబా మోనికా జాన్ చాలా అందంగా కనిపించింది. ఈ చిత్రంలో పలువురు హాస్య నటులు ఉన్నప్పటికీ, టీజర్ ప్రధానంగా శ్రీవిష్ణు పాత్రపై, ప్రేమపై ద్వేషం వెనుక కథపై ఫోకస్ చేసింది. ఓవరాల్ గా టీజర్ చూస్తే సామజవరగమన క్లీన్ ఎంటర్ టైనర్ అనే భావన కలిగిస్తుంది. కామెడీ ఎంటర్‌టైనర్‌లను డీల్ చేయడంలో తనకు తానే సాటి అని రామ్ అబ్బరాజు మరోసారి నిరూపించుకున్నాడు. టీజర్‌లో దాదాపు ప్రతి సీక్వెన్స్‌లోనూ హ్యుమర్ ఉంది. రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీని అందించగా, గోపీ సుందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హ్యుమర్ ని పెంచింది. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్. నిర్మాణ విలువలు సినిమా జానర్‌కు తగ్గట్టుగా వున్నాయి.
టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ.. సామజవరగమన కంప్లీట్ ఎంటర్ టైనర్. ఇంత ఎంటర్ టైనర్ నేనూ ఎప్పుడు చేయలేదు. మెదడుకి పెద్ద పని లేకుండా హాయిగా సదరగా నవ్వుకొని, మీ అందరితో కూడా ఎంజాయ్ చేయించాలనుకొని చేసిన సినిమా ఇది. సినిమా చాలా బాగా వచ్చింది. మొదటి నుంచి చివరి వరకూ నవ్వుకుంటూనే వుంటారు. సినిమా హిలేరియస్ గా వుంటుంది. సాయి, భాను కి థాంక్స్. గోపి సుందర్ చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు. ఆయనతో కలసి పని చేయడం ఆనందాన్ని ఇచ్చింది. రెబా మోనికా జాన్ చాలా బాగా నటించింది. అనిల్ సుంకర గారితో అప్పట్లో ఒకడుండేవాడు సినిమా నుంచి అనుబంధం వుంది. ఆ సినిమా గురించి చాలా గొప్పగా చెప్పారు. ఆయనతో చేస్తే చాలా మంచి సినిమా చేయాలని అనుకున్నాను. ఆయనతో ఈ సినిమా చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. హిలేరియస్ గా వుంటుంది అదే సమయంలో కంటెంట్ కూడా వుంటుంది. ఇందులో అందరికీ కనెక్ట్ అయ్యే పాయింట్ వుంది. నిర్మాత రాజేష్ దండా గారు కోవిడ్ సమయంలో ఈ కథతో వచ్చినపుదు ఆయన మారేడుమిల్లీ, భైరవ కోన తరహాలో ఉంటుందని అనుకున్నాను. కానీ ఇది సూపర్ ఫన్ సబ్జెక్టు. కథ విన్నప్పుడే చాలా ఎంజాయ్ చేశాను. సామజవరగమన చాల మంచి కథ. మే 18న మీ ముందుకు వస్తోంది. రెండుగంటల పాటు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ ని ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే రేపు ఏజెంట్ సినిమా వస్తోంది. అనిల్ సుంకర గారికి అందరూ బ్లాక్ బస్టర్ ఇస్తారని కోరుకుంటున్నాను. అలాగే మేలో మా సినిమాతో బ్లాక్ బస్టర్ కొడుతున్నాం అన్నారు
నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ.. సామజవరగమన కథ రామ్ చెప్పగానే బాగా నచ్చింది. ఎంటర్ టైన్ మెంట్ నా జోనర్. చాలా రోజులైయింది ఎంటర్ టైన్ మెంట్ మూవీస్ చేసి. కథ వినగానే చేయాలని నిర్ణయించుకున్నాను. శ్రీవిష్ణు ఎంచుకునే కథలు యూనిక్ గా వుంటాయి. సామజవరగమన కొత్త కాన్సెప్ట్ తో రూపొందిన పక్కా ఎంటర్ టైనర్. మొదటి నుంచి చివరి వరకూ నవ్వుతూనే వుంటారు. రాజేష్ కథల ఎంపిక బావుంటుంది. తను భవిష్యత్ లో మంచి నిర్మాత అవుతారు. రెబా జాన్ మంచి హీరోయిన్ అవుతుంది. రామ్ చాలా క్రమశిక్షణతో సినిమా చేశాడు. చాలా నిజాయితీ గల దర్శకుడు. యూనిట్ లో అందరూ కష్టపడ్డారు. సామజవరగమన చూడండి. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ టైం మీ ఫ్యామిలీ ని కూడా తీసుకువస్తారు అన్నారు.