మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 18 జూన్ 2022 (17:33 IST)

హృతిక్ రోషన్ అమ్మమ్మ పద్మారాణి కన్నుమూత

Hrithik Roshan
Hrithik Roshan
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ అమ్మమ్మ పద్మా రాణి ఓంప్రకాష్ (91) ముంబైలో కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో ఆమె బాధపడుతున్నారు. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఫలించక కన్నుమూశారు.  
 
దివంగత ఫిల్మ్ మేకర్ జే ఓం ప్రకాష్ భార్యే పద్మ రాణి. ఈ దంపతుల కుమార్తే పింకీ రోషన్. జే ఓం ప్రకాష్ 1974లో కసమ్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రంలో రాజేష్ కన్నా హీరోగా నటించారు. 
 
ఆ తర్వాత హీరో జితేంద్రతో కలిసి ఓం ప్రకాష్ అనేక చిత్రాల్లో పనిచేశారు. కాగా ఓం ప్రకాష్ 93 ఏళ్ల వయసులో ఆగస్టు 7, 2019న మరణించారు. 
 
ఇప్పుడు ఆయన సతీమణి కూడా కన్నుమూశారు. దీంతో పలువురు ప్రముఖులు హృతిక్ కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నారు.