శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 12 ఏప్రియల్ 2022 (13:33 IST)

హీరో నాగచైతన్యకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల అపరాధం

naga chaitanya
టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్యకు హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు అపరాధం విధించారు. హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వద్ద వాహనాలను పోలీసులు తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీల సమయంలో అటుగా వచ్చిన నాగచైతన్య కారు అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిల్మ్ తొలగించి రూ.700 అపరాధం విధించారు. 
 
కాగా, ఇటీవలికాలంలో హైదరాబాద్ నగర పోలీసులు ముమ్మరంగా వాహనాలు తనికీ చేస్తూ ప్రెస్, మీడియా, పోలీస్ వంటి స్టిక్కర్లు అంటిచుకున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవడమేకాకుండా అపరాధం విధిస్తున్నారు. అలాగే, అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిల్మ్‌ను తొలగిస్తున్నారు. 
 
కాగా, ఇటీవల టాలీవుడ్ హీరోలు అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ కార్ల అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిల్మ్‌ను తొలగించి అపరాధం విధించిన విషయం తెల్సిందే. తాజాగా నాగ చైతన్య వంతు వచ్చింది.