శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 6 ఆగస్టు 2023 (13:56 IST)

నిర్మాతల కష్టాలు - డబ్బు విలువ తెలుసు ... శృతిహాసన్

shruti haasan
సాధారణంగా హీరోయిన్లపై తరచుగా ఓ కంప్లైంట్ వినిపిస్తూ ఉంటుంది. ఒక సినిమా హిట్టు కాగానే పారితోషికాలు పెంచేస్తారని, నిర్మాతలకు చుక్కలు చూపిస్తారని రకరకాలు చెప్పుకొంటుంటారు. శ్రుతిహాసన్ విషయంలోనూ ఇలాంటి వార్తలే బయటకు వచ్చాయి. ఈ యేడాది వరుసగా రెండు హిట్లు కొట్టింది శ్రుతి. ఇప్పుడు 'సలార్‌‌'లోనూ నటిస్తున్నారు.
 
అయితే, పారితోషికం గట్టిగా డిమాండ్ చేయడంతో నిర్మాతలు వెనకంజ వేస్తున్నారని టాలీవుడ్‌లో చెవులు కొరుక్కొంటున్నారు. వీటిపై శ్రుతి తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. "నేను సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినదాన్ని. నిర్మాతల సాధక బాధకాలు నాకు బాగా తెలుసు. మా నాన్న కూడా ఓ నిర్మాతే. అలాంటప్పుడు నిర్మాతల్ని నేనెందుకు ఇబ్బంది. పెడతాను?" అని ప్రశ్నించింది.
 
పైగా, "నాకు డబ్బు విలువ బాగా తెలుసు. మా అమ్మానాన్నలు అలా పెంచారు. చేసే ప్రతి పనికీ ఓ విలువ ఉంటుంది. నా వాల్యూ ఎంతో నాకు బాగా తెలుసు. అంతకు మించి ఆశించింది ఏం లేదు. ఓ సినిమా ఒప్పుకోవడానికీ, వద్దని చెప్పడానికీ చాలా కారణాలు ఉంటాయి. ప్రతీసారీ పారితోషికమే ప్రాతిపదిక కాదు. ఒక్కోసారి పాత్ర నచ్చినప్పుడు తీసుకొనే రెమ్యునరేషన్ గురించి అస్సలు ఆలోచించను. నేనే కాదు. చాలామంది కథానాయికలు ఇలానే ఉంటారు. కానీ బయట మరోలా ప్రచారం జరుగుతుంటుంది" అని ఆవేదన వ్యక్తం చేశారు.