సినిమా ఫ్లాప్ అయితే, హీరోయిన్‌పై నిందలు ఎందుకు వేస్తారు : నటి తాప్సీ
ఒక సినిమా ఫ్లాప్ అయితే, హీరోయిన్‌పై నిందలు ఎందుకు వేస్తారని నటి తాప్సీ అన్నారు. ఇటీవలికాలంలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఆమె నిలుస్తున్నారు. తాజాగా మరోసారి ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. టాలీవుడ్ సినిమాలు చేస్తున్న సమయంలో తనకు వరుసగా ఫ్లాప్స్ వచ్చాయని... ఆ సమయంలో తనపై చాలా విమర్శలు వచ్చాయని చెప్పింది.
తనను ఐరన్ లెగ్ అన్నారని మండిపడింది. సినిమా ఫ్లాప్ అయితే హీరోయిన్‌పై నిందలు ఎందుకు వేస్తారని ప్రశ్నించింది. సాధారణంగా హీరోయిన్లు కొన్ని సన్నివేశాలు, పాటలకే పరిమితమవుతారని... అలాంటప్పుడు సినిమా ఫెయిల్ అవడానికి వారెలా కారణమవుతారని అడిగింది.
హీరోలను నిందించకుండా హీరోయిన్లను నిందిస్తారని చెప్పింది. కెరీర్ ప్రారంభంలో ఎలాంటి సినిమాలు సెలెక్ట్ చేసుకోవాలో తనకు తెలిసేది కాదని... అందువల్ల తన సినిమాలు ఫ్లాప్‌లుగా నిలిచాయని తెలిపింది. ఆ సమయంలో తనపై వచ్చిన విమర్శలు తనను బాధించాయని... ఆ తర్వాత వాటిని పట్టించుకోవడం మానేశానని చెప్పింది.