గురువారం, 2 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (17:57 IST)

నేను ఈ స్థాయికి కార‌ణం శ్రీ‌రామ్‌గారే: అల్లు అరవింద్

Kshana kshananam team, Allu arsvind
మన మూవీస్ బ్యానర్లో ఉదయ్ శంకర్, జియా శర్మ హీరో హీరోయిన్లుగా కార్తిక్ మేడికొండ దర్శకత్వంలో డాక్టర్ వర్లు నిర్మించిన సినిమా `క్షణక్షణం`. డార్క్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 26న గీతా ఫిలింస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. చిత్ర యూనిట్ సభ్యులతో పాటు నిర్మాత అల్లు అరవింద్, సిరివెన్నెల సీతారామశాస్త్రి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ, నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం శ్రీరామ్ గారు. ఆయన నాకు గురు సమానులు. వారి అబ్బాయి ఉదయ్ హీరోగా నటిస్తున్న ఈ క్షణ క్షణం సినిమా బాగుందని విన్నాను. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాకు పని చేసిన అందరూ నటీనటులకు టెక్నీషియన్స్ కు బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను. నిర్మాతగా మారిన డాక్టర్ వర్లు గారు మరిన్ని సక్సెస్‌ఫుల్ సినిమాలు చెయ్యాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
 
నిర్మాత డాక్టర్ వర్లు మాట్లాడుతూ, పర్సనాలిటీ డెవలప్మెంట్ టీచర్ అయిన నేను నిర్మాతగా మారడానికి కారణం మా గురువు శ్రీరామ్ సార్. ఆయన కోసం వారి అబ్బాయి ఉదయ్‌తో నేను నిర్మాతగా మారి క్షణక్షణం సినిమా తీశాను. సినిమాల పట్ల ఆసక్తితో ఉదయ్ నటుడయ్యాడు, తను మంచి నటుడితో పాటు మంచి మేధావి. ఈ సినిమా విషయానికి వస్తే చాలా ఎమోషన్స్ ఉన్నాయి. ఆడియన్స్ థ్రిల్స్ ఫీల్ అవుతారని తెలిపారు.
 
హీరో ఉదయ్ శంకర్ మాట్లాడుతూ, క్షణం క్షణం నా మూడో సినిమా. నటన పరంగా ఎక్కువ స్కోప్ ఉన్న కథ ఇది. కేవలం ఇరవై ఆరు వర్కింగ్ డేస్ లో సినిమా ఫినిష్ చేశాము. మాకు సపోర్ట్ చేసిన అల్లు అరవింద్ గారికి బన్నీ వాసు గారికి ధన్యవాదాలు. వెంకటేష్ గారు మా సినిమా బాగుందని సోషల్ మీడియాలో షేర్ చేశారు. మా సినిమాతో పాటు వస్తున్న అన్ని సినిమాలు సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.  ఈ సినిమా థియేట‌ర్స్ వ‌ర‌కూ వ‌స్తుందంటే అల్లు అర‌వింద్ గారి స‌పోర్ట్ తోనే సాధ్యం అయ్యింది. ఫిబ్రవరి 26న వస్తున్న మా క్షణ క్షణం చూసి అందరూ ఎంజాయ్ చేస్తానని అనుకుంటున్నట్లు తెలిపారు. 
 
గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరి జీవితంలో కొందరు హీరోలుంటారు. నా జీవితంలో అలాంటి హీరో అల్లు అరవింద్ గారు. సినిమా పిచ్చోడి చేతిలో రాయి కాదు గమ్యం, గమనం సరిగ్గా ఉంటే ఖచ్చితంగా లక్ష్యాన్ని చేరుకోవచ్చని అరవింద్ గారు నిరూపించారు. ఎంతోమంది రీల్ హీరోలను తయారుచేశారు. గెలుపు ఓటమి అనే రెండు పదాలకు నిర్వచనం, అర్థం లేదు. గెలవడం అంటే యుద్ధానికి సిద్ధం కావడం. ఆ తర్వాత ఓడామా గెల్చామా అనేది ముఖ్యం కాదు. ఒకడు యుద్ధానికి సిద్ధమయ్యాడూ అంటే గెల్చినట్లే లెక్క.

ఇలా ఒక ఇష్టాన్ని అనుసరిస్తూ సినిమా చేసిన ఉదయ్ ఇప్పటికే గెలిచేశాడు. ఇక కమర్షియల్ లెక్కలు అవీ తర్వాత, తన లక్ష్యం వైపు అతను వేసిన అడుగే గెలిచినట్లు చేసింది. ఉదయ్ పట్టుదల ఉండి శ్రమించే వ్యక్తి. అతనికి నా ఆశీస్సులు ఉంటాయి. ఉదయ్ మరింత పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నా. ఈ సినిమాలో పనిచేసిన నా మరో ఆత్మీయుడు సంగీత దర్శకుడు కోటి. మా ఇద్దరి కెరీర్ దాదాపు ఒకేసారి ప్రారంభమైంది. రోషన్.. తండ్రి కోటి లక్షణాలు పుణికి పుచ్చుకున్నాడు. మంచి మ్యూజిక్ చేశాడు. డాక్టర్ వర్లు గారితో నాకు పరిచయం లేదు గానీ ఆయనతో ఎప్పటినుంచో స్నేహం ఉన్న అనుభూతి కలుగుతోంది. క్షణక్షణం సినిమాలో ఏదో విషయం ఉంది. ఫీల్ గుడ్ సినిమా అనిపిస్తోంది. అన్నారు.
 
హీరోయిన్ జియా శర్మ మాట్లాడుతూ, అర్జున్ రెడ్డితో తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొందగలిగాను. క్షణ క్షణం తో మరింత దగ్గర అవుతాననే నమ్మకం ఉంది. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ కార్తికేయ, నిర్మాతలు వర్లు, చంద్ర మౌళి లకు థాంక్స్. మరిన్ని తెలుగు సినిమాలలో భాగం అవ్వాలని కోరుకుంటున్నాను. క్షణ క్షణం మిమ్మల్ని తప్పకుండా ఎంటర్టైన్ చేస్తుంది. 26న థియేటర్లలో లో కలుద్దాం. అన్నారు.