శనివారం, 25 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By TJ
Last Modified: సోమవారం, 11 సెప్టెంబరు 2017 (21:42 IST)

కాంచన-3 సినిమా తీస్తా - ఆ సినిమా అలా ఉంటుంది.. లారెన్స్

లారెన్స్ రాఘవ. కాంచన 1,2 సినిమాలతో తెలుగు, తమిళ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించడమే కాకుండా భయపెట్టారు కూడా. కాంచన సినిమా సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఉండటమే ప్రేక్షకులు బాగానే ఆదరించారు. సెంటిమెంట్, కామెడీ, ఎమోషనల్, భయానకం ఇలా ఒక్కటేమిటి ఆ సినిమాలో అన్నీ ఉన్

లారెన్స్ రాఘవ. కాంచన 1,2 సినిమాలతో తెలుగు, తమిళ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించడమే కాకుండా భయపెట్టారు కూడా. కాంచన సినిమా సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఉండటమే ప్రేక్షకులు బాగానే ఆదరించారు. సెంటిమెంట్, కామెడీ, ఎమోషనల్, భయానకం ఇలా ఒక్కటేమిటి ఆ సినిమాలో అన్నీ ఉన్నాయి. కాంచన-1, కాంచన-2 రెండూ బాగా ఆడాయి. ఇదే తరహాలో కొంతమంది సినిమా తీయాలనుకున్నా అది సాధ్యం కాలేదు. 
 
కానీ రాఘవ లారెన్స్ మాత్రం మళ్ళీ అదే సినిమాను మూడవ భాగంగా తెరకెక్కించాలన్న ఆలోచనలో ఉన్నారట. ఇదే విషయాన్ని లారెన్స్ ఈ రోజు తిరుమలలో చెప్పారు. శ్రీవారిని దర్శించుకున్న లారెన్స్ ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. 
 
కాంచన రెండు భాగాలను ప్రేక్షకులు బాగా ఆదరించారని, మరోభాగం తీయాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. త్వరలోనే కథను రాస్తానని ఆ సినిమా మొత్తం కామెడీ ఎక్కువగా వుండే విధంగా చూస్తున్నట్లు తెలిపారు. శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.