ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 3 జనవరి 2023 (18:25 IST)

లవ్ రెడ్డి గ్లిమ్స్ చూస్తే నాకు లవ్ స్టొరీ చెయ్యాలనుంది : ప్రశాంత్ వర్మ

Love Reddy team with  Prashanth Varma
Love Reddy team with Prashanth Varma
ఆంధ్ర, కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో జరిగే ప్రేమకథగా  లవ్ రెడ్డి చిత్రం రూపొందుతోంది. గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్,  బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం లవ్ రెడ్డి. అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరో హీరోయిన్లు గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఆంధ్ర కర్ణాటక బాడర్ లో జరిగే స్వచ్ఛమైన ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో స్మరన్ రెడ్డి దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. హేమలత రెడ్డి, మదన్ గోపాల్ రెడ్డి, ప్రభంజనం రెడ్డి, నాగరాజు బీరప్ప సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 
 
ఈ చిత్ర గ్లిమ్స్ ను దర్శకుడు ప్రశాంత్ వర్మ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... లవ్ రెడ్డి గ్లిమ్స్ చాలా ఫ్రెష్ గా ఉంది. నాకు కూడా ఒక లవ్ స్టొరీ చెయ్యాలని అనిపిస్తుంది ఈ గ్లిమ్స్ చూస్తుంటే, అందరూ యంగ్ టీమ్ కలిసి చేసున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు. 
 
డైరెక్టర్ స్మరన్ మాట్లాడుతూ... ఆంధ్ర, కర్ణాటక బాడర్ లో జరిగే ఒక స్వచ్ఛమైన ప్రేమకథ లవ్ రెడ్డి. అన్ని సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే విధంగా సినిమా ఉంటుంది. త్వరలో టీజర్ ట్రైలర్ విడుదల చెయ్యబోతున్నాము. మా సినిమాకు సపోర్ట్ చేసున్న నిర్మాతలకు ఇతర టెక్నీషియన్స్ కు ముఖ్యంగా హీరో అంజన్ రామచంద్ర కు కృతజ్ఞతలు తెలిపారు. 
 
హీరో అంజన్ రామచంద్ర మాట్లాడుతూ... లవ్ రెడ్డి టైటిల్ లోగోను నందమూరి బాలకృష్ణ గారు లాంచ్ చేశారు, ఇప్పుడు గ్లిమ్స్ ను ప్రశాంత్ వర్మగారు విడుదల చేయడం సంతోషంగా ఉంది. సినిమా చాలా బాగా వచ్చింది. దర్శకుడు స్మరన్ కథను నడిపిన విధానం బాగుంది. గ్లిమ్ కు మంచి స్పందన లభిస్తోంది. ఒక మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు.
 
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: స్మరన్ రెడ్డి, నిర్మాతలు: సునంద బి.రెడ్డి,మదన్ గోపాల్ రెడ్డి, ప్రభంజన్ రెడ్డి,  సహా నిర్మాతలు: హేమలత రెడ్డి,  నాగరాజు బీరప్ప, నవీన్ రెడ్డి, సుష్మిత రెడ్డి, హరీష్, బాబు, రవికిరణ్, జకరియా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రవీంద్ర రెడ్డి
సంగీతం: ప్రిన్స్ హేన్రి, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు