బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: గురువారం, 25 జులై 2019 (21:55 IST)

బిగ్ బాస్ హౌస్ లోకి పోలీసులు వెళ్తారా.. ఏమవుతుంది?

ఈసారి షో స్టార్ట్ కాకముందే బిస్ బాస్ చుట్టూ అల్లుకున్న వివాదాన్ని చూసి అసలు స్టార్టవుతుందా లేదా అని అనుకున్నారు. కానీ స్టార్టయ్యింది.. ఊహించని ట్విస్ట్‌లను ఇస్తోంది అప్పుడే. అయితే బిగ్ బాస్ చుట్టూ ఉన్న వివాదాలు మాత్రం సమసిపోలేదు.
 
షోలో తొలుత మమ్మల్ని సెలక్ట్ చేసి ఆ తరువాత కమిట్మెంట్ అడిగారని బిగ్ బాస్ పైన శ్వేతారెడ్డి, గాయత్రి గుప్తా ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ షో మీద తొలి నుంచి పోరాడుతున్న శ్వేతారెడ్డి ఇప్పటికే చాలాసార్లు ఫిర్యాదు చేశారు.
 
తాజాగా మరోసారి కూడా ఫిర్యాదు చేశారు. స్టార్ మా ఆఫీస్ లోని కొంతమందిపై ఫిర్యాదు చేశారు. వెంటనే వారిని విచారించాలని కోరారు శ్వేతారెడ్డి. దీంతో పోలీసులు స్టార్ మాకు చేరుకున్నారు. స్టార్ మాపై నోటీసులు కూడా జారీ చేశారట. త్వరలోనే విచారణ కూడా జరిగే అవకాశం ఉందట. అంటే బిగ్ బాస్ లోపలే కాదు బయట కూడా రచ్చ రచ్చ అవుతోంది.