గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: మంగళవారం, 9 మే 2017 (15:46 IST)

శివగామిని శ్రీదేవి అంగీకరిస్తే... ప్రభాస్‌ను పట్టించుకునేవారే కాదు...

రాంగోపాల్ వర్మ మొత్తానికి శ్రీదేవి అభిమానిని అనిపించారు. శ్రీదేవి పట్ల తనకున్న అభిమానం ఎంతటిదో మరోసారి ట్వీట్లతో చెప్పేశాడు. బాహుబలి చిత్రంలో శివగామి క్యారెక్టర్లో నటించిన రమ్యకృష్ణ ఆ పాత్రలో ఒదిగిపోయిందని చెపుతూనే శ్రీదేవి విషయాన్ని ఎత్తుకొచ్చాడు. శ

రాంగోపాల్ వర్మ మొత్తానికి శ్రీదేవి అభిమానిని అనిపించారు. శ్రీదేవి పట్ల తనకున్న అభిమానం ఎంతటిదో మరోసారి ట్వీట్లతో చెప్పేశాడు. బాహుబలి చిత్రంలో శివగామి క్యారెక్టర్లో నటించిన రమ్యకృష్ణ ఆ పాత్రలో ఒదిగిపోయిందని చెపుతూనే శ్రీదేవి విషయాన్ని ఎత్తుకొచ్చాడు. శ్రీదేవి కనుక బాహుబలి చిత్రంలో శివగామి పాత్ర చేసేందుకు ఒప్పుకుని వుంటే ప్రభాస్‌ను పట్టించుకునేవారు కాదంటూ చెప్పుకొచ్చాడు. 
 
బాహుబలి మూవీ క్రెడిట్ మొత్తం శ్రీదేవికే వచ్చేసేదనీ, ఇంగ్లీష్ - వింగ్లీష్ చిత్రం తర్వాత ఆమె బాహుబలి చేసినట్లయితే ఆమె రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయేదని పొగడ్తల జల్లు కురిపించారు. అభిమాని అంటే అంతేలే... పాతతరాన్ని కదిలిస్తే ఎన్టీఆర్, ఏఎన్నార్, సావిత్రి, జమునల ముందు వీళ్లెంతా అంటారు. అది మామూలే. వర్మ అభిప్రాయం వర్మది.