సోమవారం, 21 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 21 అక్టోబరు 2024 (14:03 IST)

సంపాదిస్తే ఇల్లు, కారు కొనుక్కోవాలి, కానీ రాకేష్ మాత్రం కేసీఆర్ అనే సినిమా తీశాడు : అనసూయ

KCR team
KCR team
రాకింగ్ రాకేష్ లీడ్ రోల్ లో నటిస్తున్న మూవీ 'కేశవ చంద్ర రమావత్' (కెసిఆర్), గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ మూవీకి గరుడవేగ అంజి దర్శకత్వం వహించారు. అన్నన్య కృష్ణన్ కథానాయికగా నటిస్తున్నారు. రాకింగ్ రాకేష్ స్వయంగా నిర్మించిన ఈ చిత్రం లంబాడీ వర్గానికి చెందిన యువకుడి రియల్ లైఫ్ నుంచి స్ఫూర్తి పొందింది.
 
కేశవ చంద్ర రమావత్ (కెసిఆర్), అతని మరదలు మధ్య చిన్ననాటి స్నేహాన్ని ప్రజెంట్ ద్వారా ట్రైలర్ ప్రారంభమైయింది,అది క్రమంగా ప్రేమగా మారుతుంది. తన షార్ట్ నేమ్ కేసీఆర్‌ అని సగర్వంగా చెప్పుకునే ఆ యువకుడు కేసీఆర్‌తో ఎంతో స్ఫూర్తి పొందాడు. అయితే అతను తన చిన్ననాటి మరదలుతో మ్యారేజ్ ప్రపోజల్ ని రిజెక్ట్ చేస్తాడు. కథ ఇలా సాగుతుండగా, కేసీఆర్ ఒక లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌కు బయలుదేరుతాడు.
 
రాకింగ్ రాకేష్ మనసుని హత్తుకునే కథను రాసారు. గరుడ వేగ అంజి దర్శకుడిగా, సినిమాటోగ్రాఫర్‌గా కట్టిపడేశారు. ఈ కథనం గ్రామీణ తెలంగాణ సారాంశాన్ని, సంస్కృతిని అందంగా చూపించింది. చరణ్ అర్జున్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పవర్ ఫుల్ ఎమోషనల్ లేయర్‌ని యాడ్ చేసింది. బలగం మధు ఎడిటింగ్‌ బ్రిలియంట్ గా వుంది , మహేష్ బల్లంట్ ఆర్ట్ డైరెక్టర్. గోరెటి వెంకన్న, కాసర్ల శ్యామ్‌లు సాహిత్యం అందించారు.
 
రాకేష్, కేసీఆర్ పాత్రలో లీనమై హీరోగా ఆకట్టుకునే పెర్ఫార్మెన్స్ కనబరిచారు. అన్నన్య కృష్ణన్ బ్యూటీఫుల్ గా వుంది. తనికెళ్ల భరణి, ధనరాజ్, తాగుబోతు రమేష్, జోర్దార్ సుజాత, లోహిత్ కుమార్, బలగం మైమ్ మధు, రచ్చ రవి, కృష్ణ భగవాన్, అంజి, సాయి చరణ్ కిష్టప్ప, జబర్దస్త్ ప్రవీణ్, జబర్దస్త్ నవీన్, జబర్దస్త్ సన్నీ జబర్దస్ రాజు వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రాన్ని త్వరలో థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
 
రాకింగ్ రాకేష్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమాని మూడు ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించాలని నా కోరిక. దానికి మీరందరూ సపోర్ట్ కావాలి. సాయి రాజేష్ అన్న ఎంత థాంక్స్ చెప్పుకున్న తక్కువే. సాయి రాజేష్ అన్నకి నా ఎప్పటికీ రుణపడి ఉంటాను. అనసూయ గారు నన్ను జీరో దగ్గర నుంచి చూసిన వ్యక్తి. ఒక అమ్మలా చుసుకున్నారు. వారు ఈ ఈవెంట్ కి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం చాలా ఆనందంగా వుంది. డైరెక్టర్ అంజన్న సినిమాని చాలా ఫ్యాషన్ తో తీశారు. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. నన్ను ఒక బిడ్డ లాగా అన్ని నేర్పించారు. ఎన్ని క్రాఫ్ట్ లు ఉన్నాయో అన్ని క్రాఫ్ట్ లు నేర్పించారు. చరణ్ అర్జున్ అన్న అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఆయన త్వరలో బిగ్ బ్యానర్స్ లో పనిచేయబోతున్నారు. నా సక్సెస్ కారణం నా భార్య సుజాత. ఈ జర్నీలో చాలా సపోర్ట్ చేశారు. మా సినిమాలో పని చేసిన ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు' తెలిపారు.
 
డైరెక్టర్ అంజి మాట్లాడుతూ, రాకేష్ చాలా అద్భుతమైన కథను రాశారు. కథ విన్న వెంటనే ఈ సినిమా చేస్తానని చెప్పాను. ఈ సినిమాకి చరణ్ మ్యూజిక్ డైరెక్టర్ తో పాటు లిరిక్స్ రాశారు. కొన్ని పాటలు పాడారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ అన్ని హైలైట్ అవుతాయి. హీరోయిన్ అనన్య చాలా ఫెంటాస్టిక్ గా పెర్ఫామ్ చేసింది' తెలిపారు. 
 
డైరెక్టర్ సాయి రాజేష్ మాట్లాడుతూ, హృదయ కాలేయం ఆడియో ఫంక్షన్ కి రాకేష్ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా స్కిట్ చేసి వెళ్ళాడు. ఆ కృతజ్ఞత నాకు అలా ఉండిపోయింది. తొందరలోనే  క్యారెక్టర్ రాసి రుణం తీర్చుకుంటాను. సినిమా తీసి చూస్తే జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. ఈ సినిమా ట్రైలర్ చాలా బావుంది. ఈ సినిమాతో రాకేష్ మంచి స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్ అంజి గారు మంచి దర్శకులు మంచి కెమెరామెన్. అర్జున్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్' చెప్పారు. 
 
అనసూయ మాట్లాడుతూ, రాకేష్ నా తమ్ముడు లాంటివాడు. చాలా హానెస్ట్ గా ఈ సినిమా తీశారు. రెండు డబ్బులు సంపాదిస్తే ఇల్లు, కారు కొనుక్కోవాలి అనుకుంటారు. కానీ రాకేష్ మాత్రం ఒక మంచి సినిమా తీయాలనుకున్నాడు, ట్రైలర్ చాలా బాగుంది. చాలా ప్రౌడ్ గా అనిపించింది. అంజి గారు చాలా బ్రిలియంట్ గా ఈ కథని తీశారు. చరణ్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాలో పనిచేసిన ఆర్టిస్టులకి, టెక్నీషియన్ అందరికీ ఆల్ ది బెస్ట్. రాకేష్ చాలా హానెస్ట్ గా ఈ సినిమా తీసుకొస్తున్నారు. ఆడియన్స్ కూడా అంతే హానెస్ట్ గా రిసీవ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను అన్నారు.