మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : గురువారం, 2 సెప్టెంబరు 2021 (17:10 IST)

గ‌మ‌నం కథ విన్నాక ఇళ‌యారాజ లే నిల‌బ‌డు అన‌డంతో భ‌య‌మేసిందిః సృజన

Gamanam team
శ్రియ శరన్, నిత్య మీనన్, ప్రియాంక జవాల్కర్ , శివ కందుకూరి న‌టించిన సినిమా `గమనం`. సృజన ద‌ర్శ‌కురాలిగా ప‌రిచ‌య‌మ‌వుతోంది. క్రియా ఫిల్మ్ కార్పొరేషన్, కాళీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై, మాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమా చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. విడుద‌ల‌కు సిద్ద‌మైంది. ఈ సంద‌ర్భంగా చిత్రం గురించి ప‌లు విష‌యాలు తెలియ‌జేశారు. 
 
ముందుగా ర‌చ‌యిత సాయిమాధవ్ బుర్ర మాట్లాడుతూ, గమనం సినిమా చాలా ప్రత్యేకమయిన సినిమా, ఈ కధ చెప్పినప్పుడే ఈ సినిమా కి రాయాలి అని పించింది,  సినిమా ప్రతి ఫ్రేమ్ లో ద‌ర్శ‌కురాలి త‌పన కనిపిస్తుంది, ఆమె ఆలోచనలు చాలా కొత్త గా ఉంటాయి, కధ బాగుంటేనే బాబా గారు నిర్మాణం లో భాగం అవుతారు, ఇళయరాజా గారితో స్క్రీన్ లో నా నేమ్ పడటం నా అదృష్టం, శ్రీయ గారి తో గౌతమి పుత్ర శాతకర్ణి, ఇప్పుడు గమనం చేయటం చాలా సంతోషం చాలా మంచి నటి తను. సినిమా చాలా బాగా వచ్చింది మీకు బాగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను అని తెలిపారు.
 
ద‌ర్శ‌కురాలు సృజన మాట్లాడుతూ, ఏ  కధ చెప్పినా దానికి ఒక నైతిక‌త ఉండాలి అలాంటి కధ నే గమనం. చిన్న కధ రాసి బాబా గారి కి, జ్ఞాన శేఖర్ గారికి  చెప్పాను. వెంట‌నే స్టార్ చేద్దాం అన్నారు, తరువాత ఇళయరాజా గారికి చెప్ప‌డానికి వెళ్ళాను. నచ్చితే చేస్తాను అన్నారు, విన్న తర్వాత లే నిలబడు అన్నారు నాకు భయం వేసింది, తర్వాత ఫోటో తీసుకున్నారు చాలా సంతోషం అనిపించింది, గమనం సినిమా మనం చేస్తున్నాం అన్నారు, తరువాత శ్రీయకి చెప్పాను తనకి బాగా నచ్చింది. సాయిమాధవ్ బుర్ర గారికి చెప్పిన‌ప్పుడు తగు సూచ‌న‌లు ఇచ్చారు. శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్ ఇలా ఒక్కొక్క‌రూ ఈ సినిమాలో ప్ర‌వేశించార‌ని తెలిపారు.
 
శ్రీయ శరన్ మాట్లాడుతూ, ఈ కధ సృజన హృద‌య‌లోతుల్లోంద‌చి వచ్చిన కధ, గమనం సినిమాలో నేను భాగమయినందుకు సంతోషంగా వుంద‌ని పేర్కొన్నారు.
హీరో  శివ కందుకూరి మాట్లాడుతూ, గమనం చాలా బ్యూటిఫుల్ ఫిల్మ్. ఈ సినిమాలోని ప్రతి క్యారెక్టర్ మీకు బాగా కనెక్ట్ అవుతుంది, సినిమా చూసాక మీరు నేను చెప్పింది కరెక్ట్ అంటారు, మా ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది, త్వరలోనే సినిమా థియేటర్స్ లో రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నాం అన్నారు.
 
ప్రియాంక జవాల్కర్ తెలుపుతూ, ఈ క‌థ స‌హ‌జ‌త్వంగా వుంటుంది, మంచి క్వాలిటీ వున్న సినిమా చేస్తున్నాన‌ని నాకు అనిపించింది, శివ తో వర్క్ చేయటం చాలా కంఫర్ట్ గా  ఫీల్ అయ్యాను,మేము చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యాము, శ్రీయ గారు చాలా అందంగా వుంటారు, మా సినిమాకి శ్రీయ గారి వల్ల చాలా అందం వచ్చింది, తప్పకుండ గమనం మూవీ మీకు నచ్చుతుంది అని చెప్పారు.