ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 16 జులై 2024 (12:18 IST)

భర్త మైఖేల్ డోలన్, కుమారుడు కోవా ఫోటోలను షేర్ చేసిన ఇలియానా

Ileana D'Cruz
Ileana D'Cruz
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఇలియానా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆస్క్ మి ఎనీథింగ్ సెషన్‌లో, తన భర్త మైఖేల్ డోలన్, కుమారుడు కోవా ఫీనిక్స్ డోలన్‌తో కలిసి చిత్రాలను పంచుకుంది. ఈ సెషన్‌లో ఇటీవలి జీవితం గురించిన అప్‌డేట్‌లను పంచుకున్నారు. 
 
ఒక ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారు తన భర్తతో ఉన్న చిత్రాన్ని పోస్ట్ చేయమని నటిని అడిగినప్పుడు, ఇలియానా మైఖేల్ డోలన్‌తో ఒక సూపర్ క్యూట్ క్లిక్‌ని పోస్టు చేయడం జరిగింది. ఆమె పోస్ట్‌కు "ప్రీ బేబీ బేబీస్" అని క్యాప్షన్ ఇచ్చింది. 
 
ఇలియానా డి'క్రూజ్ గతేడాది ఆగస్టులో మైఖేల్ డోలన్‌తో కలిసి తన కుమారుడు కోవా ఫీనిక్స్ డోలన్‌కు జన్మనిచ్చింది. మరో యూజర్ ‘మిమ్మల్ని మళ్లీ సినిమాల్లో ఎప్పుడు కలుద్దాం’ అని ప్రశ్నించగా.. "సమయం వచ్చినప్పుడు.. నా కొడుకుకు ఇప్పుడే సమయం ఇవ్వాలనుకుంటున్నాను" అని ఇలియానా బదులిచ్చారు.