రాయ్‌లక్ష్మీ గ్లామర్ ఫొటోలపై మండిపాటు
గ్లామర్ బ్యూటీ రాయ్‌లక్ష్మీ కొన్ని సినిమాలలో కథానాయకిగా చేసినా పెద్దగా పేరు రాలేదు. కాంచనలో గ్లామర్‌ను ఆరబోసిన అది పెద్దగా లాభించలేదు. ఆ తర్వాత ఐటెంసాంగ్‌లకు పరిమితమైంది. ఇక ఆ తర్వాత కరోనా వేవ్ రావడంతో ప్రస్తుతం అందరిలాగే ఇంటికే పరిమితమైంది. అందుకే ఈ మధ్య సోషల్ మీడియాలో తరచూ ఏదో ఈవెంట్ చేసుకుంటూ ఫొటోలు పెడుతుంది.
సోషల్ మీడియాలో పెడుతున్న రాయ్ లక్ష్మీ ఫొటోలపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఎందుకంటే స్వస్థలం బెల్గాం, చెన్నైలో కరోనా విలయతాండం చేస్తుంటే అవేవీ పట్టన్నట్లు తన ఫొటోలు తన ఫంక్షన్లకు సంబంధించిన వివరాలు తెలియజేస్తుంది. కేక్‌లు కట్‌చేస్తూ, మదర్స్ డే నాడు రకరకాల ఫంక్షన్ల పేరుతో ఫొటోలు షేర్ చేయడంతో ఇవన్నీ ఈ పరిస్థితులలో అవసరమా! అంటూ నెటిజన్లు మండిపతున్నారు. ప్రస్తుతం సినిమాలు లేకపోవడంతో సోషల్‌మీడియాలో ఫాలోయింగ్ పెంచుకుని డబ్బులు ఆర్థించేందుకు చేస్తున్న ప్లానా అంటూ చురకలు వేశారు. దీనికి తను ఇంతవరక ఎటువంటి సమాధానం చెప్పలేదు.