సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By మనీల
Last Updated : శుక్రవారం, 25 అక్టోబరు 2019 (15:02 IST)

100 రోజులు పూర్తిచేసుకోనున్న ఇస్మార్ట్ శంకర్, పూరీకి చార్మి పార్టీ

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ కథానాయకుడిగా ఈ ఏడాది జూలై 18వ తేదీన 'ఇస్మార్ట్ శంకర్' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన ప్రతిచోట ముఖ్యంగా మాస్ ప్రాంతాల్లో ఈ సినిమా విజయవిహారం చేసింది. ఆ తరువాత చాలా సినిమాలు విడుదలైనా కూడా గట్టి పోటీ ఇస్తూ, ఈ రోజుతో 100 రోజులను పూర్తి చేసుకోనుంది.
 
రామ్ వైవిధ్య పాత్రలో కనిపించాడు. అతని మాస్ లుక్, ఆయన తెలంగాణ యాస ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నిధి అగర్వాల్, నభా నటేశ్ గ్లామర్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గ్లామర్ డోస్ పెంచేయడం మాస్ ఆడియన్స్ నుంచి మరిన్ని మార్కులు దక్కడానికి కారణమైంది.

ఇక మణిశర్మ అందించిన పాటలు ఆడియన్స్‌‌‌ను ఒక ఊపు ఊపేశాయి. ఎక్కడ చూసినా ఈ పాటలే వినిపిస్తున్నాయి. చాలాకాలం తరువాత పూరి తన సత్తా చూపాడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లలేదు. పూరి పూర్తి మార్కుతో వచ్చిన కారణంగానే ఈ సినిమా ఈ స్థాయి విజయం లభించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా 100 రోజులు పూర్తవుతున్న సందర్భంగా పూరీకి చార్మి గ్రాండ్ పార్టీ ఇస్తోందట.