ఆనందంతో నిద్దర పోయి ఐదు రోజులైందిః కార్తీక్ సాయి
కార్తీక్ సాయి హీరోగా పరిచయం అవుతూ, డాలీషా, నేహా దేశ్‌పాండే నాయికలుగా చిన్నా దర్శకత్వంలో రూపొందిన చిత్రం `కార్తీక్'స్ ది కిల్లర్`. ఈనెల3న విడుదలై హిట్ టాక్ తెచ్చుకుందని చిత్ర యూనిట్ తెలియజేస్తుంది. యాదవ్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ పై ఆవుల రాజు యాదవ్, సంకినేని వాసు దేవ రావు నిర్మించారు.
ఈ సందర్భంగా హీరో, దర్శకుడు కార్తీక్ సాయి ( చిన్నా ) మాట్లాడుతూ, ఇది నా పదేళ్ల కష్టం. ఈ కరోనా సమయంలో ఏ థియటర్స్ లో హౌస్ ఫుల్ లేదు. నా సినిమానే కాదు ఎవరి సినిమా అయినా ఫుల్స్ లేవు.. కానీ ఈ వారంలో విడుదలైన సినిమాల్లో మా సినిమాకు ఎక్కువ కలక్షన్స్ వచ్చాయి. ప్రేక్షకులు కొత్తవాళ్లు తీసినట్టు లేదని అంటున్నారు. ప్రస్తుతం థియటర్స్ పెరిగాయి. ఈ ఆనందంతో నిద్దర పోయి ఐదు రోజులైంది. ఈ సినిమా విషయంలో నెగిటివ్ మాట్లాడిన వాళ్లకు గూబ పగిలే సమాధానం వచ్చింది. ఈ సినిమా విషయంలో ఎడిటర్ నాని ప్రతి విషయంలో సపోర్ట్ చేసాడు.నాకు తొందరగా ఏది దక్కదు. ఇదైనా దక్కుతుందా లేదా అనుకున్నాను కానీ విజయం దక్కింది. అది చాలు మాకు. ఈ సినిమా తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక కలిపి 150 కి పైగా థియటర్స్ లో విడుదల చేసాం. ఈ సినిమాకు మీరిచ్చిన సపోర్ట్ తో మరిన్ని మంచి సినిమాలు తీస్తాం అని తెలిపారు.
ఎడిటర్ నాని మాట్లాడుతూ, ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న రోజు ఇది. కార్తీక్ సాయి హీరో , దర్శకుడిగా చాలా కష్టపడ్డాడు. అయన కష్టం ఈ రోజు సక్సెస్ రూపంలో మాకు దక్కింది. చిన్న సినిమాలు బతికితేనే ఇండస్ట్రీకి చాలా మంచిది. ఈ సినిమా విషయంలో టీం అందరు ఎంతగానో కష్టపడ్డారో తెలుసు. ఈ సినిమా విషయంలో సపోర్ట్ అందించిన ప్రేక్షకులకు థాంక్స్ అన్నారు.
నటుడు మధు మాట్లాడుతూ .. ఈ సినిమాలో నాకు ఇంత మంచి పాత్ర ఇచ్చిన కార్తీక్ అన్నకు థాంక్స్. ఇన్నాళ్లు నన్ను హైడ్ చేసారు.. ఎందుకు అన్న అని అడిగితె నిన్ను చూపిస్తే మన కథ తెలిసిపోతుంది అని బయటికి చూపించలేదు. ఈ సినిమా విషయంలో ఇద్దరికీ థాంక్స్ చెప్పాలి, ఒకటి డైరెక్టర్ చిన్నా గారికి, రెండు హీరో కార్తీక్ కు. అయన ఇచ్చిన సపోర్ట్ తో ఈ సినిమా చేశాను, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నిజంగా ఈ సినిమా విషయంలో వాసుదేవ్ గారు ఇచ్చిన సపోర్ట్ తోనే ఇంతబాగా వచ్చింది సినిమా అన్నారు.
హీరోయిన్ డాలీషా మాట్లాడుతూ, ఈ సినిమా విషయంలో ఫలితం మా టీం మొత్తానికి ఇవ్వాలి. ప్రతి ఒక్కరు తమ సినిమా అని కష్టపడ్డారు. నాకు ఇంతమంచి సినిమాలో ఛాన్స్ ఇచ్చిన కార్తీక్ కు, వాసు గారికి థాంక్స్, ఏ సినిమా అయినా ఎంటర్ టైన్మెంట్ పైనే ఆధారపడి ఉంది. అది ఇందులో వుందన్నారు.
నిర్మాత వాసుదేవరావు మాట్లాడుతూ, ఎడిటర్ నాని, కెమెరా మెన్ ఆర్యన్ , సతీష్, ప్రియా ఇలా ప్రతి ఒక్కరు ఈ సినిమాకు ఎంతగానో కష్టపడ్డారు. హీరోయిన్ డాలీషా సింగిల్ టేక్ ఆర్టిస్ట్. ఈ సినిమాకు ఇంతమంచి సక్సెస్ అందించిన ప్రేక్షకులకు మరోసారి థాంక్స్ అన్నారు.
సురేష్ కొండేటి మాట్లాడుతూ, చిన్న సినిమాగా విడుదలైన కిల్లర్ సినిమా పెద్ద విజయం అందుకోవడం ఆనందంగా ఉంది. చిన్న సినిమాలు సక్సెస్ అయినప్పుడే పరిశ్రమకు మంచింది. అలాగే ఈ సినిమా విషయంలో కార్తీక్, వాసుగారు మొదటి రోజు ఎలా ఉన్నారో సినిమా విడుదల తరువాత ఈ రోజు వరకు వాళ్లలో అదే ఎనర్జీ కనిపించింది. ఈ సక్సెస్ తో మరిన్ని సినిమాలు చేయాలనీ కోరుకుంటున్నాను అన్నారు. లైన్ ప్రొడ్యూసర్ ప్రియా కూడా మాట్లాడారు.