సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 7 మే 2020 (19:03 IST)

జగదేకవీరుడు అతిలోక సుందరి సీక్వెల్‌లో చెర్రీ, జాన్వీ? (video)

Jagadeka Veerudu Athiloka Sundari
దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో, అశ్వీనిదత్ నిర్మాణంలో తెరకెక్కిన సినిమా జగదేకవీరుడు అతిలోక సుందరి. ఈ చిత్రం 2020 మే 09 నాటికీ 30 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా నిర్మాత అశ్వినిదత్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి కథ రెడీ అవుతుంది.
 
ఈ సినిమాకు సీక్వెల్ తీసి చిత్ర పరిశ్రమ నుంచి గౌరవంగా రిటైర్మైంట్ ప్రకటిస్తానని తెలిపాడు. మరి ఈ చిత్రంలో హీరో, హీరోయిన్స్‌గా ఎవరు ఉంటారనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

సీక్వెల్‌లో రామ్‌చరణ్‌, జాన్వీ నటిస్తే బాగుంటుందని నెటిజన్స్ భావిస్తున్నారు. ఈ చిత్రం రామ్ చరణ్ కూడా ఆసక్తి చూపుతున్నాడని.. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో మళ్లీ ఈ సినిమా సీక్వెల్‌ను రూపొందించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.