గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 7 జులై 2021 (12:53 IST)

జగ్గూభాయ్ సూపర్ లుక్.. రాజకీయాల్లోకి వస్తారా?

Jagapathi Babu
సెకండ్ ఇన్నింగ్స్‌లో విలన్‌గా ఆకట్టుకుంటున్న జగ్గుభాయ్ అలియాస్ జగపతి బాబు ప్రస్తుతం 'టక్‌ జగదీష్‌' 'మహాసముద్రం', 'రిపబ్లిక్‌' తదితర చిత్రాల్లో నటిస్తున్నారు. రీల్ లైఫ్‌లోనే కాదు.. రియల్ లైఫ్‌లోనూ ఆయన స్టైలే డిఫరెంట్‌. 
 
తాజాగా సోషల్ మీడియాలో న్యూ లుక్‌ని పోస్ట్ చేయగా అభిమానులు కామెంట్లు, ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చారు జగపతిబాబు. 
 
డైనమిక్ పొలిటిషియన్ లా కనిపిస్తున్నారు.. మీరు త్వరలో పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నారా..?' అని ప్రశ్నించగా 'ఖచ్చితంగా రాజకీయ నాయకుడిగా మాత్రం ఉండాలనుకోవడం లేదు' అని తేల్చిచెప్పేశారు జగ్గుభాయ్.