గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 13 ఆగస్టు 2024 (20:23 IST)

శ్రీదేవి 61వ జయంతి : శ్రీవారి సేవలో జాన్వీ కపూర్

jhanvi kapoor
బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన తల్లి, బాలీవుడ్ దిగవంత నటి శ్రీదేవి 61వ జయంతి సందర్భంగా.. ప్రతి ఏడాది తిరుపతిని సందర్శించే ఆచారాన్ని అనుసరిస్తూ మంగళవారం శ్రీవారి దర్శనం చేసుకుంది. గతంలో శ్రీదేవి సైతం తిరుమల శ్రీనివాసుడిపై ఉన్న  భక్తితో తన ప్రతి పుట్టిన రోజు నాడు తిరుమలకి వచ్చి దర్శనం చేసుకునేవారు. ఈ నేపథ్యంలో ఆమె కుమార్తె జాన్వీ దానిని కొనసాగిస్తోంది. తనకు వీలునప్పుడల్లా తిరుపతి ఆలయాన్ని జాన్వీ సందర్శిస్తుంది.
 
తిరుమల చేరుకున్న జాన్వీ స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తర్వాత జాన్వీ కపూర్ స్వామివారికి షాష్టాంగ నమస్కారం చేసింది. అచ్చమైన తెలుగమ్మాయిలా పట్టుచీరలో కనిపించి అందరినీ ఆకట్టుకుంది. పక్కనే జాన్వీ స్నేహితుడు సన్నిహితుడు శిఖర్ పహారియా కూడా ఉన్నారు. 
 
ఇక త‌న త‌ల్లికి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలుపుతూ ఇన్‌స్టాలో ఆమె ఒక పోస్ట్ చేశారు. ఇందులో తిరుప‌తి మెట్లు, త‌ల్లితో త‌న చిన్న‌ప్ప‌టి ఫొటో, తాను చీర‌లో ఉన్న ఫొటోల‌ను షేర్ చేశారు. హ్యాపీ బ‌ర్త్ డే అమ్మా. ఐ ల‌వ్యూ అంటూ పోస్ట్ చేసింది. తిరుమల కొండతో పాటు, తాను చీర క‌డితే, త‌న త‌ల్లి శ్రీదేవికి చాలా ఇష్ట‌మ‌ని జాన్వీ గతంలో వెల్లడించింది.