ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 14 ఏప్రియల్ 2019 (13:10 IST)

మూడేళ్ల క్రితమే లూయిస్‌ను పెళ్లి చేసుకున్నాను.. మేఘనా నాయుడు

ఐటమ్ సాంగ్ క్వీన్ మేఘన నాయుడు పెళ్లి చేసుకుంది. తెలుగులో హీరోయిన్‌గా పరిచయమైన మేఘనా నాయుడు కన్నడ, హిందీ, తమిళ చిత్రాల్లో నటించింది. తాజాగా తాను మూడేళ్ల క్రితమే ఓ విదేశీయుడిని పెళ్లి చేసుకున్నానని పేర్కొంది. 
 
2016లో టెన్నిస్ ఆటగాడు లూయిస్‌ను పెళ్లి చేసుకున్నానని, ఆయనతోనే ఉంటున్నానని ఓ ప్రకటనలో చెప్పింది మేఘన. ముంబైలో తమ వివాహం సీక్రెట్‌గా జరిగిందని.. వచ్చే సంవత్సరం క్రైస్తవ సంప్రదాయం ప్రకారం.. ఘనంగా వివాహం జరుగుతుందని మేఘన చెప్పుకొచ్చింది. 
 
ఇకపోతే.. మేఘన రహస్య పెళ్లిపై గతంలోనే వార్తలు వచ్చాయి. ఆమె విదేశీయుడిని పెళ్లాడి, అక్కడే సెటిల్ అయినట్టు కూడా మీడియా కోడైకూసింది.