మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Vasu
Last Modified: బుధవారం, 25 జులై 2018 (15:08 IST)

ఆంధ్రుల అభిమాన నటుడు, సినీ 'యముడు' పుట్టినరోజు

తెలుగు సినీ పరిశ్రమలో యముడిగా నటించదగిన గంభీరమైన ఆహార్యం కలిగి ఉండే ఏకైక నటుడిగా, ఆంధ్రుల అభిమాన అన్నగారైన నందమూరి తారక రామారావుతో సహపాటిగా నటించి నవరసనట సార్వభౌముడిగా పేరొందిన కైకాల సత్యనారాయణ జన్మదినం ఈ రోజే.

ఇప్పటివరకు 28 పౌరాణిక చిత్రాలతో సహా మొత్తం 777 చలనచిత్రాలలో నటించిన ఆయన తనదైన ముద్రతో ఎటువంటి పాత్రలోనైనా ఒదిగిపోతూ, ప్రతినాయకుడిగానే కాకుండా విభిన్న పాత్రలలో తన సహజ నటనా కౌశలంతో తెలుగు ప్రేక్షకుల మన్నన పొందారు. ఒకవిధంగా చెప్పాలంటే తెలుగు నాట యస్వీ రంగారావు లేని లోటుని భర్తీ చేయడంలో ఈయనకు మరెవ్వరూ సాటి లేరనేది నిర్వివాదాంశం.
 
అన్నగారు తెలుగుదేశం పార్టీని స్థాపించిన రోజులలో అన్నగారితో పాటు పనిచేస్తూ, వ్యవస్థాపక సభ్యునిగా కొనసాగుతూ 11వ లోక్‌సభకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మచిలీపట్నం నియోజకవర్గం నుండి అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. ఈయన ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని ఈ సందర్భంగా హృదయపూర్వకంగా కోరుకుందాము.