1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 19 జూన్ 2021 (12:26 IST)

మెగా ఫ్యామిలీ హీరోయిన్‌గా కాజ‌ల్ అగ‌ర్వాల్‌

Kajal Agarwal
న‌టి కాజల్ అగర్వాల్ వివాహం త‌ర్వాత కూడా గ్లామ‌ర్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు. వివాహం త‌ర్వాత ఆమె చేసిన ఆచార్య‌. మెగాస్టార్ చిరంజీవి స‌ర‌స‌న న‌టిస్తోంది. ఇంత‌కుముందు ఖైదీనెం.150లోనూ న‌టించింది. 1985 జూన్ 19న ముంబైలో జ‌న్మించిన ఆమె పుట్టిన‌రోజు ఈరోజే. ఆమెకు మొద‌ట‌గా కొణిద‌ల ప్రొడ‌క్ష‌న్ శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ ట్వీట్ చేసింది. ఈ సంద‌ర్భంగా వారికి ధ‌న్య‌వాదాలు తెలిపింది. ఆమె సినీ కెరీర్ బాలీవుడ్ సినిమా `క్యూ.హో గయా నా`తో ప్రారంభ‌మైనా అక్క‌డ పెద్ద‌గా స‌క్సెస్ కాలేదు. ద‌క్షిణాది వైపు వ‌చ్చేసింది. తెలుగు, త‌మిళం సినిమాల‌లోనూ ఎక్కువ‌గా చేసింది. అందులో తెలుగు సినిమాలే అధికం. అంద‌లోనూ మెగాస్టార్ చిరంజీవి కుటుంబీకుల‌తో న‌టించ‌డం విశేషం.
 
కాజ‌ల్ 2007లో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన `లక్ష్మీ కల్యాణం` సినిమాలో కథానాయికగా తెలుగు తెరకు పరిచమయింది. అదే ఏడాది సి. క‌ళ్యాణ్ నిర్మించిన `చంద‌మామ‌` సినిమాలో నాగ‌బాబు కుమార్తెగా న‌టించింది. ఆమె న‌ట‌న న‌చ్చి ఆమెకు త‌మ కుటుంబీకుల సినిమాల్లో అవ‌కాశాలు ఇప్పిస్తున్నాడ‌నే వార్త‌లు వ‌చ్చాయి. అనుకున్న‌ట్లుగానే ఆమె 2009లో రామ్‌చ‌ర‌ణ్‌తో `మ‌గ‌ధీర‌` న‌టించింది. ఈ సినిమాకు వ‌చ్చిన స్పంద‌న వ‌ల్ల ఆమెకు మ‌రిన్ని అవ‌కాశాలు ద‌క్కాయి. ఆ త‌ర్వాత రామ్ తో గ‌ణేష్‌, ప్ర‌భాస్తో డార్లింగ్ చేసింది. మ‌ర‌లా మెగా ప్యామిలీలోని అల్లు అర్జున్ తో ఆర్య 2 లో నటించింది. 2010లో ఈమె తమిళ హీరో సూర్య తమ్ముడు కార్తీ సరసన నా పేరు శివ చిత్రంలో నటించి తమిళ చిత్రరంగ ప్రవేశం చేసింది. 
 
2012 లో పూరీజగన్నాథ్ దర్శకత్వంలో బిజినెస్ మాన్ సినిమాలో నటించారు. సూర్య సరసన మాట్రన్ అనే తమిళ సినిమాలో నటించింది. మ‌ర‌లా మెగా ఫ్యామిలీతో రామ్‌చ‌ర‌ణ్‌తో ఎవ‌డు, గోవిందుడు అంద‌రివాడే, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో `స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్‌`, చిరంజీవితో `ఖైదీ నెం.150` సినిమాలు చేసింది. ఇప్పుడు తాజాగా మెగాస్టార్ స‌ర‌స‌న `ఆచార్య‌`లో న‌టిస్తోంది. ఇలా ఆ కుటుంబంతో ఎక్కువ సినిమాల చేస్తున్న కాజ‌ల్ తాజాగా మెగా ఫ్యామిలోనే మ‌రో హీరోతో న‌టించ‌నున్న‌ద‌ని స‌మాచారం. న‌టిగా ఒకే కుటుంబంలోని వారితో చేయ‌డం అరుదైన విష‌య‌మే చెప్పాలి.