శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 13 ఆగస్టు 2023 (14:17 IST)

రెండో ఇన్నింగ్స్‌లోనూ సత్తా చాటుతున్న కాజల్ అగర్వాల్

Kajal- Bhagwant Kesari
కాజల్ అగర్వాల్ తన రెండో ఇన్నింగ్స్‌లోనూ సత్తా చాటుతుంది. కొన్ని విలువైన అవకాశాల్ని అందిపుచ్చుకుంటూ ముందుకు సాగుతుంది. కమల్ హాసన్, బాలకృష్ణ లాంటి సీనియర్ కథానాయకుల చిత్రాల్లో మెరుస్తోంది. ఈ జాబితాలోనే నాగార్జున చిత్రం కూడా చేరినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. 
 
మలయాళంలో సూపర్ హిట్టైన 'పొరింజు మారియన్ జోస్'ను తెలుగులో రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నాగార్జున కథానాయకుడిగా నటిస్తారు. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కథానాయికగా కాజల్ని ఎంచుకొంటారని టాక్. 
 
ఇప్పటివరకు ఈ సినిమా కోసం టబు పేరు పరిశీలనకు వచ్చింది. అయితే టబు కంటే కాజల్ బెటర్‌గా ఉంటుందని, నేటివిటీ సమస్య ఉండదని చిత్రబృందం భావించిందట. పైగా తల్లిగా మారాక కాజల్ కాస్త పద్ధతైన పాత్రలను ఎంచుకొంటోంది. 
 
తన వల్ల ఈ క్యారెక్టర్ డెప్త్ మరింత పెరుగుతుందని చిత్రబృందం నమ్ముతోంది. కాజల్ పరిశ్రమలోకి అడుగుపెట్టి ఇన్నేళ్లయినా నాగార్జునతో కలిసి నటించలేదు. ఆ అవకాశం ఇప్పటికి వచ్చింది. నాగ్ నటించే 99వ సినిమా ఇదే. త్వరలోనే ఈ చిత్రానికి క్లాప్ కొట్టనున్నారు.