గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 27 ఫిబ్రవరి 2023 (17:44 IST)

బాలయ్యతో చందమామ.. త్వరలో సెట్స్‌‌లో జాయిన్ కానున్న కాజల్

Kajal Aggarwal
గతేడాది మగబిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ మూడు నెలల తర్వాత మళ్లీ విధుల్లో చేరింది. ఆమె ప్రస్తుతం కమల్ హాసన్- శంకర్‌లతో కలిసి "ఇండియన్ 2"లో పనిచేయడం ప్రారంభించింది. అయితే ఆమె ఒక తెలుగు సినిమాకి సైన్ చేయడానికి ఇప్పటి వరకు వెయిట్ చేసింది.
 
కాజల్ అగర్వాల్, పెళ్లికి ముందు చివరిసారిగా 2021లో తెలుగు చిత్రంలో కనిపించింది. మంచు విష్ణు నటించిన  మోసగాళ్లు చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం బాలయ్య సినిమాలో నటించేందుకు ఓకే చెప్పింది.
 
వచ్చే వారంలో ఆమె ఈ చిత్రానికి సంబంధించిన పనిని ప్రారంభించనుంది. ఈ చిత్రానికి సంబంధించిన కొత్త షూటింగ్ షెడ్యూల్ మార్చి 4న ప్రారంభం కానుంది. 
 
త్వరలో ఆమె బాలయ్య సినిమా సెట్స్‌లో పాల్గొననుంది. ఇకపోతే.. నందమూరి బాలకృష్ణతో తొలిసారి కాజల్ జతకట్టనుంది. అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.