అందర్నీ కడుపుబ్బా నవ్వించడానికి వచ్చేస్తున్న .. ‘కళాపోషకులు’
విశ్వకార్తికేయ, దీప ఉమావతి హీరో హీరోయిన్లుగా శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై చలపతి పువ్వల దర్శకత్వంలో యం.సుధాకర్ రెడ్డి నిర్మాతగా రూపొందించిన చిత్రం కళాపోషకులు. నటుడు జెమిని సురేష్ ముఖ్య పాత్రలో నటించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని పాటలకి, ట్రైలర్స్‌కి విశేషమైన స్పందన లభిస్తోంది. అలాగే పోస్టర్స్ డిజైన్స్ అన్ని చూపరులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. క్రేజీ అంచనాలతో రాబోతున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాల్ని పూర్తి చేసుకొని డిసెంబరు 18వ తేదీన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భారీగా విడుదల కావడానికి రెడీ అయ్యింది.
దర్శకుడు చలపతి పువ్వల మాట్లాడుతూ, 'కళాపోషకులు' చిత్రం సెన్సార్ పూర్తి అయింది. యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. సభ్యులంతా సినిమా చూసి చాలా బాగుందని, ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసే చిత్రం అని అప్రిషియేట్ చేశారు. అలాగే ఇండస్ట్రీలోని పెద్దలు కొంత మందికి షోస్ వేసి చూపించాం. సినిమా చూసిన ప్రతి ఒక్కరు మంచి సినిమా తీశారు. చాలా అద్భుతంగా ఉందని కంగ్రాట్స్ చెప్పారు.
అదేవిధంగా ప్రేక్షకులు కూడా సినిమా చూసి ఎంజాయ్ చేస్తారనే నమ్మకం ఉంది. నన్ను నమ్మి కథపై ఉన్న నమ్మకంతో ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చిన మా నిర్మాత సుధాకర్ రెడ్డికి కృతజ్ఞతలు. విశ్వకార్తికేయ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. మొదటి సినిమా అయినా చాలా బాగా నటించారు. లవ్ స్టోరీతో పాటు ఫ్యామిలీ ఎలిమెంట్స్ అన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడానికి మా 'కళాపోషకులు' డిసెంబర్ 18న వచ్చేస్తున్నారు... అన్నారు.
నిర్మాత యం. సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, 'టీజర్, ట్రైలర్స్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. సినిమా కూడా చిన్న వారి దెగ్గర్నుండి పెద్దవాళ్ళవరకు నచ్చుతుంది. ముఖ్యంగా యూత్ ఆడియెన్స్‌కి నచ్చే ఎలిమెంట్స్ చాలా వున్నాయి. దర్శకుడు చలపతి పువ్వల కథ చెప్పిన దానికన్నా బిగ్ స్క్రీన్‌పై సూపర్బ్‌గా తెరకెక్కించాడు. ఇదొక యూత్‌ఫుల్ ఎంటర్ టైనింగ్ మూవీ. కల్యాణ్ సమి తన కెమెరా వర్క్‌తో ప్రతి ఫ్రేమ్ అందంగా చిత్రీకరించారు. ఆణి ముత్యాల్లాంటి ఐదు పాటలకు ఎలెందర్ మహావీర్ అత్యద్భుతంగా ట్యూన్స్ కంపోజ్ చేసాడు.
అలాగే తన ఆర్‌ఆర్‌తో సినిమాని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లాడు. ఎలెందర్ మ్యూజిక్, కళ్యాణ్ సమి కెమెరా పనితనం సినిమాకి హైలైట్‌గా నిలుస్తాయి. సెన్సార్ సభ్యులు సినిమా చూసి యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. వారందరూ సినిమా చూసి బాగా ఎంజాయ్ చేశారు. కుటుంబమంతా కలసి చూసే ఒక మంచి ఎంటర్‌టైన్మెంట్ మూవీ తీశారని అభినందించారు. డిసెంబర్ 18న రాబోతున్న ఈ చిత్రం తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు అలరిస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కళాపోషకులు చిత్రాన్ని భారీగా విడుదల చేస్తున్నాం.. అన్నారు.
బ్యానర్: శ్రీ వెన్నెల క్రియేషన్స్
నటీనటులు: విశ్వకార్తికేయ, దీప ఉమాపతి, భాష, చైతన్య, చిన్ను
కెమెరామెన్: కళ్యాణ్ సమి
ఎడిటర్: సెల్వ కుమార్
సంగీతం: ఎలేందర్ మహావీర్
పీఆర్ఓ: సాయి సతీష్
నిర్మాత, స్టొరీ: సుధాకర్ రెడ్డి.ఎమ్
స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్: చలపతి పువ్వల.