శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 20 ఆగస్టు 2018 (15:42 IST)

కోలమావు కోకిలగా నయన.. కరణ్ జోహార్ ప్రశంసల జల్లు

దక్షిణాది లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం సినీ షూటింగ్‌ల్లో బిజీ బిజీగా గడుపుతోంది. వరుసగా సినిమాలు చేస్తూ భారీగా సంపాదిస్తోంది. పారితోషికం పేరిట కోట్ల మేర తన ఖాతాలో వేసుకుంటోంది. స్టార్ హీరోలో కాక

దక్షిణాది లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం సినీ షూటింగ్‌ల్లో బిజీ బిజీగా గడుపుతోంది. వరుసగా సినిమాలు చేస్తూ భారీగా సంపాదిస్తోంది. పారితోషికం పేరిట కోట్ల మేర తన ఖాతాలో వేసుకుంటోంది. స్టార్ హీరోలో కాకుండా, యంగ్ హీరోలు, ఇంకా కమెడియన్లతో జత కట్టేందుకు సై అంటోన్న నయనతార..  తాజాగా కొత్త దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఆమె 'కొలమావు కోకిల' చేసింది. 
 
ఈ సినిమా చిన్న బడ్జెట్ సినిమా అయినా కలెక్షన్లు మాత్రం కుమ్మేస్తోంది. ఈ నెల 17వ తేదీన ఈ సినిమా తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన తొలి మూడు రోజుల్లోనే ఈ సినిమా 10 కోట్ల రూపాయలను రాబట్టేసి, నయనతార తన సత్తా చాటింది. కేన్సర్‌తో బాధపడుతోన్న తల్లికి ట్రీట్మెంట్ చేయించడం కోసం డ్రగ్స్ మాఫియాలోకి దిగే పాత్రను నయనతార పోషించింది. డ్రగ్స్‌ను సప్లయ్ చేసే పాత్రలో ఆమె నటన అద్భుతమనే టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది. 
 
తెలుగులో ఈ సినిమా కోకో కోకిల అనే పేరిట త్వరలో విడుదల కానుంది. ఈ సినిమాపై తారల నుంచి నయనతారకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నయనను కోకో కోకిల సినిమాకు గాను ప్రశంసించగా, బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ కూడా నయనకు కితాబిచ్చారు.