శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 9 జులై 2018 (14:23 IST)

నయనపై ప్రియుడి ప్రశంసల జల్లు.. ఏమన్నాడో తెలుసా?

అగ్రహీరోయిన్, లేడీ సూపర్ స్టార్ నయనతారపై దర్శకుడు విఘ్నేశ్ శివన్ ప్రశంసల జల్లు కురిపించాడు. నయన నటించిన కోలమావు కోకిల సినిమాలో నయనతార స్టిల్‌ను ట్విట్టర్లో పోస్టు చేశారు. నయనతారను చూస్తుంటే గర్వంగా వు

అగ్రహీరోయిన్, లేడీ సూపర్ స్టార్ నయనతారపై దర్శకుడు విఘ్నేశ్ శివన్ ప్రశంసల జల్లు కురిపించాడు. నయన నటించిన కోలమావు కోకిల సినిమాలో నయనతార స్టిల్‌ను ట్విట్టర్లో పోస్టు చేశారు. నయనతారను చూస్తుంటే గర్వంగా వుందని చెప్పాడు. కొత్త కథలు, దర్శకులపై ఆమెకున్న నమ్మకాన్ని కొనియాడాడు. సినిమాలపై నయన తీసుకునే నిర్ణయాలు, తెరపై ఆమె ప్రదర్శన స్ఫూర్తిదాయకమని ప్రశంసించాడు. 
 
ఇకపోతే.. నయన్‌ నటించిన సినిమా కోలమావు కోకిలకు నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకుడు. యోగిబాబు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అనిరుధ్‌ స్వరాలు అందించారు. ఈ నెలలో చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కథానాయిక ప్రాధాన్యం ఉన్న ఈ సినిమా పాపులర్‌ అమెరికన్‌ షో బ్రేకింగ్‌ బ్యాడ్‌ ఆధారంగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 
 
ఈ చిత్రానికి నయన్ కాబోయే భర్త, ప్రియుడు విఘ్నేశ్ శివన్ సాహిత్యం అందించారు. కాగా త్వరలో వీరి పెళ్లి జరగనున్నట్లు సమాచారం. నయన్‌-విఘ్నేశ్‌ కలిసి అనేక సార్లు విహారయాత్రలకు వెళ్లారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.