శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : ఆదివారం, 20 మే 2018 (17:01 IST)

విఘ్నేశ్‌‌తో నయనతార.. అమెరికా ట్రిప్.. ఫోటోలు వైరల్..

దక్షిణాది టాప్ హీరోయిన్ నయనతార- ప్రముఖ దర్శకుడు విఘ్నేశ్ శివన్ లవ్‌లో వున్న సంగతి తెలిసిందే. ఈమె త్వరలో విఘ్నేశ్‌ను పెళ్లాడనుందని కోలీవుడ్‌లో జోరుగా చర్చ సాగుతోంది. వెండితెర అరంగేట్రం చేసి దశాబ్దం దాట

దక్షిణాది టాప్ హీరోయిన్ నయనతార- ప్రముఖ దర్శకుడు విఘ్నేశ్ శివన్ లవ్‌లో వున్న సంగతి తెలిసిందే. ఈమె త్వరలో విఘ్నేశ్‌ను పెళ్లాడనుందని కోలీవుడ్‌లో జోరుగా చర్చ సాగుతోంది. వెండితెర అరంగేట్రం చేసి దశాబ్దం దాటుతున్నా ఇప్ప‌టికీ ద‌క్షిణాదిన టాప్ హీరోయిన్‌గా కొనసాగుతున్న నయనతార లేడీ సూపర్ స్టార్ స్థాయికి ఎదిగింది. 
 
కోలీవుడ్‌లో స్టార్ హీరోలతో సమానమైన పారితోషికం, వసూళ్లు వస్తున్నాయి. తెలుగులో అగ్రహీరోల సరసన నటించిన నయనతార ప్రస్తుతం.. విఘ్నేష్ శివ‌న్‌తో ప్రేమ‌లో ఉంది. వీరిద్ద‌రూ ఇప్ప‌టికే పెళ్లి కూడా చేసుకున్నార‌నే పుకార్లు వినిపిస్తున్నాయి. 
 
అవి ఎంత‌వ‌ర‌కు నిజ‌మో తెలియ‌దు కానీ, షూటింగ్ గ్యాప్‌లో వీరిద్దరూ ఫారిన్ ట్రిప్పులేస్తున్నారు. అక్కడ వీరిద్దరూ తీసుకునే సెల్ఫీలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఆమెరికా వెళ్లి వ‌చ్చిన ఈ జంట తాజాగా దిగిన ఫోటోలను నెట్టింట పోస్టు చేశారు. అవి కాస్త వైర‌ల్‌గా మారిపోతున్నాయి.