మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 2 ఏప్రియల్ 2018 (13:29 IST)

నయన్-విఘ్నేష్‌కు పెళ్లైపోయిందా..? కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం..

నయనతార, విఘ్నేష్‌లకు పెళ్లైపోయిందని కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. దక్షిణాది సినీ పరిశ్రమలో అగ్ర హీరోయిన్ నయనతార.. ప్రముఖ దర్శకుడు విఘ్నేశ్ శివన్‌ను స్నేహితులు, సన్నిహితుల మధ్య వివాహం చేసుకుందన

నయనతార, విఘ్నేష్‌లకు పెళ్లైపోయిందని కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. దక్షిణాది సినీ పరిశ్రమలో అగ్ర హీరోయిన్ నయనతార.. ప్రముఖ దర్శకుడు విఘ్నేశ్ శివన్‌ను స్నేహితులు, సన్నిహితుల మధ్య వివాహం చేసుకుందని కోలీవుడ్ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇదిలా ఉంటే.. మలయాళంలో నయనతార నటించిన ''పుదియ నియమమ్‌'' చిత్రాన్ని తమిళంలో ''వాసుకి'' పేరుతో అనువదించి విడుదల చేశారు. 
 
అయితే కోలీవుడ్‌లో కొత్త సినిమాలు విడుదల చేయకూడదని నిర్ణయించి బంద్ కొనసాగిస్తున్న తరుణంలో ఈ సినిమాను విడుదల చేయడం పట్ల ఓ వర్గం నిర్మాతలు తీవ్ర వ్యతిరేక వ్యక్తం చేశారు. నయనతారకు మాత్రం ఈ ప్రత్యేకత ఏమిటని ధ్వజమెత్తారు.
 
అంతేకాదు, చెన్నైలోని నయనతార ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరికలు జారీచేశారు. దీనిపై నయనతార స్పందిస్తూ.. ఈ  సినిమా విడుదలకి, తనకు ఎటువంటి సంబంధం లేదు. అసలు ఈ సినిమాను ఎవరు విడుదల చేస్తున్నారో కూడా తనకు తెలియదని తెలిపారు. ఆ సినిమాలో నటించిన కారణంగా తనను బాధితురాలిని చేయడం ఎక్కడి న్యాయమని ఘాటుగానే స్పందించారు.