బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 15 జూన్ 2018 (13:19 IST)

కాలా హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్..?

కాలా సక్సెస్‌తో ఖుషీ ఖుషీగా వున్న సూపర్ స్టార్ రజనీకాంత్ త్వరలోనే కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో కథానాయిక కోసం చాలామంది పేర్లను పరిశీలిస్తున్నారు. ఆ జాబితాలో ప్రస్తు

కాలా సక్సెస్‌తో ఖుషీ ఖుషీగా వున్న సూపర్ స్టార్ రజనీకాంత్ త్వరలోనే కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో కథానాయిక కోసం చాలామంది పేర్లను పరిశీలిస్తున్నారు. ఆ జాబితాలో ప్రస్తుతం కాజల్ అగర్వాల్ పేరు కూడా వుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. సినిమా టీమంతా కాజల్ అగర్వాల్‌ను తలైవా సరసన నటింపజేయాలని సిఫార్సు చేస్తున్నారని కోలీవుడ్ వర్గాల సమాచారం. 
 
దీంతో కాలా తదుపరి సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుందని టాక్. ఇప్పటికే తెలుగుతో పాటు తమిళంలోనూ కాజల్ అగర్వాల్ అగ్రహీరోయిన్ ముద్ర వేసుకుంది. కోలీవుడ్ స్టార్ హీరోలు అజిత్, విజయ్, విశాల్, ధనుష్, జీవాతో జతకట్టింది. తమిళంలో హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. అలాంటి కాజల్‌కి రజనీకాంత్ మూవీలో నటించే ఛాన్సుందని టాక్.