శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 3 జూన్ 2018 (16:46 IST)

ఎల్లీ, హార్దిక్ పాండ్యా ప్రేమ ఏమైంది.. బ్రేకప్ అయ్యిందా?

బాలీవుడ్ నటి ఎల్లీ అవ్రామ్‌తో క్రికెటర్ హార్దిక్ పాండ్యా డేటింగ్‌లో ఉన్నాడనే వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ గుట్టుచప్పుడు కాకుండా కలుసుకుంటూ.. అనేకసార్లు కెమెరా కంటికి చిక్కారు. అయి

బాలీవుడ్ నటి ఎల్లీ అవ్రామ్‌తో క్రికెటర్ హార్దిక్ పాండ్యా డేటింగ్‌లో ఉన్నాడనే వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ గుట్టుచప్పుడు కాకుండా కలుసుకుంటూ.. అనేకసార్లు కెమెరా కంటికి చిక్కారు. అయితే తమ మధ్య ఎలాంటి అఫైర్ లేదన్నారు. కానీ ప్రస్తుతం వీరి ప్రేమాయణానికి సంబంధించిన వార్త షికారు చేస్తోంది. 
 
ఎల్లీకి హార్దిక్ బ్రేకప్ చెప్పాడనేదే ఆ వార్త సారాంశం. తాజాగా మరో యువనటిపై హార్దిక్ పాండ్యా మనసు పారేసుకున్నాడట. అందుకే ఎల్లీని పక్కన పెట్టేశాడని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.

కాగా డిసెంబరులో హార్దిక్ సోదరుడి వివాహంలో ఎల్లీ మెరిసిన సంగతి తెలిసిందే. ఇటీవల ఎల్లీ ఆడిన ఐపీఎల్ మ్యాచ్‌లను ఆమె వీక్షించింది. అయితే ఈ మధ్య వీరిద్దరు విడిపోయారని టాక్. అయితే ఈ బ్రేకప్ వార్తలపై హార్దిక్, ఎల్లీ స్పందించలేదు.