అనుష్క చేయి వదలని కోహ్లీ.. ఎంత ఘాటు ప్రేమ అంటూ?

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ సుందరి అనుష్క శర్మ ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లికి తర్వాత కూడా సినిమా షూటింగ్‌ల్లో బిజీబిజీగా వున్న అనుష్క శర్మపై కోహ్లీ కేర్ తీసుకుంటున

selvi| Last Updated: బుధవారం, 13 జూన్ 2018 (13:14 IST)
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ సుందరి ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లికి తర్వాత కూడా సినిమా షూటింగ్‌ల్లో బిజీబిజీగా వున్న అనుష్క శర్మపై కోహ్లీ కేర్ తీసుకుంటున్నాడు. వృత్తిరీత్యా ఇద్దరూ బిజీగా వున్నప్పటికీ.. సమయం దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో గడుపుతున్నారు. 
 
తాజాగా దేశపు మోస్ట్ పాప్యులర్ సెలబ్రిటీ కపుల్స్‌లో ఒక జంటగా గుర్తింపున్న విరుష్క తాజా ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. బెంగళూరు నుంచి ముంబైకి వచ్చిన ఈ జంట ఎయిర్ పోర్టులో మీడియా కంట పడింది. తన సతీమణి అనుష్క చేతిని వదలని విరాట్, ఆమెను ఎయిర్ పోర్టు నుంచి బయటకు తీసుకు వచ్చాడు.
 
అంతటితో ఆగలేదు.. స్వయంగా డోర్ తీసి కారు ఎక్కించాడు. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లంతా.. కోహ్లీ అనుష్క అంటే ఎంతో ప్రేమనేందుకు ఈ ఫోటోలే నిదర్శనమని కామెంట్లు పెడుతున్నారు. దీనిపై మరింత చదవండి :