గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 27 జులై 2022 (22:37 IST)

కార్తీకదీపంలోకి రీ ఎంట్రీ చేస్తున్న మోనిత

Karthika Deepam
Karthika Deepam
కార్తీక దీపం సీరియల్‌లో మోనిత క్యారెక్టర్ ఎంత పాపులర్ అయిందో మనందరికి తెలిసిందే. ఈ పాత్రలో కన్నడ నటి శోభా శెట్టి నటించింది. 
 
ఒకప్పుడు టాప్ రేటింగ్ కొల్లగొట్టిన ఈ సీరియల్ ఇప్పుడు సగానికి సగం పడిపోయింది. మళ్లీ పూర్వ వైభవం అందుకోవాలి అంటే తప్పకుండా డాక్టర్ బాబు, మోనిత, వంటలక్కలు రావాలి. 
 
అయితే వంటలక్క, డాక్టర్ బాబు పాత్రలోని చంపేశారు కాబట్టి మోనిత క్యారెక్టర్ మాత్రమే రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మోనిత ఎంట్రీతో కార్తీకదీపం సీరియల్ రేటింగ్‌లో పుంజుకోవడమే కాదు 
 
పూర్వ వైభవం అందుకునే అవకాశం కూడా లేకపోలేదు. మోనిత తిరిగి కార్తీకదీపంలోకి రావాలని ఆమె ఫ్యాన్స్ మాత్రమే కాదు.. మోనిత కూడా ఎప్పుడెప్పుడా అని వెయిటింగ్‌లో ఉన్నట్టు స్పష్టత ఇచ్చేసింది. 
 
తాజాగా ఆమె యూట్యూబ్ ఛానల్‌లో 'కార్తీకదీపంలోకి రీ ఎంట్రీ' అంటూ ఒక వీడియో పోస్ట్ చేసింది అందులో తాను కార్తీకదీపంలోకి రాబోతున్నట్టుగా హింట్ ఇచ్చింది.

మళ్లీ కార్తీకదీపం సీరియల్‌లోకి రావడానికి చాలా ఆశగా ఉంది.. రావాలా? వద్దా? అన్న కన్ఫ్యూజన్‌లో ఉన్నాం. త్వరలోనే దీనికి సంబంధించి మీకు క్లారిటీ ఇవ్వబోతున్నాను అని పేర్కొంది. అయితే మోనిత రావడం కాస్త లేటు అవ్వొచ్చేమో కానీ.. రావడం మాత్రం పక్కా అని చెప్పకనే చెప్పేస్తోంది.