బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Kumar
Last Modified: గురువారం, 23 ఆగస్టు 2018 (16:19 IST)

కేరళ వరద బాధితులకు 'మహానటి' విరాళం రూ. 10 లక్షలు

కేరళ వరద బాధితులకు పలు సినీ ఇండస్ట్రీల నుంచి చాలా మంది హీరోలు, హీరోయిన్లు తమ వంతు ఆర్థిక సాయం ప్రకటిస్తున్నారు. సావిత్రి పాత్రలో జీవించి తెలుగు ప్రేక్షకులతో మహానటిగా పిలిపించుకుంటున్న కీర్తి సురేష్ కూడా తనవంతు సహాయాన్ని అందించింది.

కీర్తి సురేష్ తనవంతు సహాయంగా 10 లక్షల రూపాయల విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి అందించింది. కానీ అంతటితో సంతృప్తి చెందకుండా మరో 5 లక్షల రూపాయలను ఖర్చు పెట్టి బాధితులకు కావాల్సిన బట్టలు, మందులు, ఇతరత్రా సామాగ్రిని కొని తనే స్వయంగా వెళ్లి బాధితులకు వాటిని పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టింది.
 
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్‌లో కనిపిస్తున్నాయి. స్టార్‌గా ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా కీర్తి సురేష్ ఇలా ప్రత్యక్షంగా సహాయ కార్యక్రమాల్లో పాల్గొనడం మహానటి సావిత్రి ప్రభావమే అని అంటున్నారు తెలుగు ప్రజలు.