శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 8 జూన్ 2020 (14:36 IST)

పెంగ్విన్ టీజర్ అదుర్స్.. జూన్ 11న ట్రైలర్ వచ్చేస్తోంది..

Keerthy Suresh
మహానటి సినిమాతో కీర్తి సురేష్ జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది. తాజాగా కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా పెంగ్విన్. ఈ సినిమాను నేరుగా ఓటిటిలో విడుదల చేయబోతున్నారు దర్శక నిర్మాతలు. థియేటర్స్ క్లోజ్ ఉండటంతో నేరుగా డిజిటల్ ప్లాట్ ఫామ్‌లో విడుదల చేస్తున్నారు దర్శక నిర్మాతలు.
 
ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమేజాన్ ప్రైమ్ వీడియోలో ఎక్స్‌క్లూజివ్‌గా జూన్ 19న విడుదల కాబోతుంది పెంగ్విన్. అమేజాన్ ప్రైమ్ వీడియోలో తమ సినిమా చూసి ఎంజాయ్ చేయమని కీర్తి సురేష్ కూడా అభిమానులను కోరుతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన నాలుగు భాషల్లో టీజర్‌ను విడుదల చేశారు. పెంగ్విన్ తెలుగు టీజర్‌ చూస్తుంటే సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కించినట్టు తెలుస్తోంది. 
 
జూన్ 11న ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. తాజాగా టీజర్‌ కూడా ఆకట్టుకునేలా ఉంది. స్టోన్ బెంచ్ ఫిల్మ్స్, ప్యాషన్ స్టూడియోస్ పతాకంపై దర్శకుడు, నిర్మాత కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాను నిర్మించాడు. ఈశ్వర్ కార్తీక్ ఈ చిత్రానికి రచయిత, దర్శకుడు. సంతోష్ నారాయణ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.