శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 7 మే 2020 (18:55 IST)

కేజీఎఫ్-2 భారీ రైట్స్.. రూ.55కోట్లకు కొనుగోలు..

కేజీఎఫ్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తొలి పార్ట్ తెరకెక్కింది. ఈ సినిమా కలెక్షన్ల పరంగానూ దున్నేసింది. 
 
తాజాగా కేజీఎఫ్ 2 డిజిటల్ రైట్స్‌ని అమేజాన్ ప్రైమ్ భారీ రేటు పెట్టి కొనేసిందట. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కేజీఎఫ్ ఫస్ట్ పార్ట్ డిజిటల్ రైట్స్‌ కూడా అమెజాన్ ప్రైమ్ భారీ రేటుకు కొనుక్కొని ప్రసారం చేసింది. అంతేకాదు అమెజాన్ ప్రైమ్‌లో ఎక్కువ మంది ఈ సినిమాను వీక్షించినట్టు అమెజాన్ ప్రైమ్ ఓ ప్రకటనలో తెలిపిన సంగతి తెలిసిందే.
 
ఇక సీక్వెల్‌లో తమన్నా యష్‌కి జోడీగా నటిస్తోందని ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అయితే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. అన్ని భాషలనూ కలిపి ఈ సినిమా రైట్స్ రూ.55 కోట్లకు కొనుగోలు చేసినట్టు సమాచారం. 
 
అలాగే ఇప్పుడు బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ అధిర పాత్రలో నటిస్తున్నారట. అలాగే రమ్యకృష్ణ, రవీనా టాండన్ కూడా సెకండ్ పార్ట్‌లో నటిస్తున్నారని తెలుస్తోంది. కరోనా ప్రభావం లేకుంటే ఈ సినిమా ఈ యేడాదే విడుదలై ఉండేది.