బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 16 ఆగస్టు 2022 (21:41 IST)

కేజీఎఫ్ దర్శకుడి మంచి మనసు.. ఏకంగా 50 లక్షల విరాళం (video)

prashant neel
జక్కన్న రాజమౌళి తర్వాత దేశంలో టాప్ డైరెక్టర్ లిస్టులో కూడా ప్రశాంత్ నీల్ చేరిపోయారు. ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ నీల్‌తో సినిమా చేసేందుకు బాలీవుడ్ హీరోలు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ప్రశాంత్ నీల్ మాత్రం సౌత్‌ని వదలకుండా ప్రభాస్‌తో ఒక సినిమా ఎన్టీఆర్‌తో ఒక సినిమా ఇప్పటికే లైన్లో పెట్టారు ప్రభాస్‌తో చేస్తున్న సలార్ సినిమా వచ్చే ఏడాది విడుదల చేస్తున్నామని అధికారికంగా ప్రకటించారు.
 
అలాగే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమా అప్డేట్ ఇవ్వడం కూడా ఆసక్తికరంగా మారింది. తాజాగా ఏపీలోని సత్యసాయి జిల్లా నీలకంఠాపురం అనే తన స్వగ్రామానికి ప్రశాంత్ వచ్చారు. స్వగ్రామానికి వచ్చిన ఆయన మాజీ మంత్రి రఘువీరారెడ్డి ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి నిర్మిస్తున్న సంగతి తెలుసుకున్నారు. 
 
నిజానికి రఘువీరారెడ్డి సోదరుడు సుభాష్ రెడ్డి సోదరుడి కుమారుడే ఈ ప్రశాంత్ నీల్. సుభాష్ రెడ్డి గతంలోనే అనారోగ్య కారణాలతో కన్నుమూయగా ఆయన సమాధి కూడా నీలకంఠాపురంలోనే ఉంటుంది.
 
ప్రశాంత్ ఏదైనా మంచి పని ప్రారంభించే ముందు అలాగే తన తండ్రి జయంతి, వర్ధంతి సందర్భంగా తన తండ్రి సమాధి సందర్శించి కాసేపు అక్కడే సమయం గడుపుతూ ఉంటారు. ఆగస్టు 15వ తేదీ సుభాష్ రెడ్డి జయంతి కావడంతో ప్రశాంత్ తండ్రి సమాధి వద్దకు వెళ్లి అక్కడే కాసేపు సమయం గడిపారు. 
 
ఇక తనకు బాబాయి వరస అయ్యే రఘువీరారెడ్డి ఆసుపత్రి నిర్మాణం చేస్తున్నారనే విషయం తెలుసుకొని హాస్పిటల్ కి అక్కడికక్కడే 50 లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించారు.
 
ఈ విషయాన్ని రఘువీరారెడ్డి తన సోషల్ మీడియా వేదికగా ఒక చిన్న వీడియో ద్వారా పంచుకున్నారు. ఇక ప్రశాంత్ ఉగ్రం అనే సినిమాతో కన్నడ దర్శకుడిగా పరిచయమయ్యారు. తర్వాత చేసిన కేజిఎఫ్ సినిమా ఆయనకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చి పెట్టింది.