బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 25 ఏప్రియల్ 2023 (13:45 IST)

ఖుష్బూ నా సెకండ్‌ మదర్‌ అన్న డింపుల్‌ హయాతి

Khushboo,  Dimple
Khushboo, Dimple
డింపుల్‌ హయాతి లేటెస్ట్‌గా రామబాణం అనే సినిమాలో గోపీచంద్‌ పక్కన నటించింది. శ్రీవాస్‌ దర్శకుడు. ఈ సినిమా షూటింగ్‌లోని ముచ్చట్లను షేర్‌ చేసుకుంది. డింపుల్‌ డ్రెస్సింగ్‌, హెయిర్‌ స్టయిల్‌ తనకు బాగా నచ్చాయని ఖుష్బూ ఇటీవలే తెలిపారు. ఈ విషయమై డింపుల్‌ సమాధానం చెబుతూ, ఆమె అలా నన్ను మెచ్చుకోవడం ఆనందంగా వుంది. మేం కలిసి సెట్లో వున్నప్పడు వాటి గురించే మాట్లాడేవారు. ఆమె గతంలో రిజెక్ట్‌ చేసిన సినిమాల గురించి కెరీర్‌ గురించి చెపుతుండేవారు.
 
ఆమె డాటర్‌ నేను మంచి ఫ్రెండ్స్‌. నేను అబ్రాడ్‌ షాపింగ్‌కు వెళితే ఆమెకు కొన్ని వస్తువులు తేచ్చేదాన్ని. ఓసారి ఈ సినిమా షూట్‌లో విదేశాలకు వెళ్ళాల్సి వచ్చింది. ఆరోజు మా మదర్‌ రాలేకపోయారు. నేను ఓ మేకప్‌ షాప్‌కు వెళ్ళాను. నేను నార్నల్‌ లిప్‌స్టిక్‌ కొంటాను. ఖుష్బూగారు వచ్చి నా ఫేస్‌మీద ట్రైన్‌ చేసి ఇది నీకు సెట్‌ అవుంది అని అన్నారు. తను లెజెండరీ నటి.. సీనియర్‌ అనే ఫీలింగ్‌ కాకుండా సేమ్‌ ఏజ్‌ అనేఫీలింగ్‌తో వుండేది. నన్ను డాటర్‌లా చూసుకునేది. ఆమె నా సెకండ్‌ మదర్‌ అని డింపుల్‌ అన్నారు. సెట్లో ఖాలీదొరికితే చాలా కబుర్లు చెప్పేవారు. కెరీర్‌ ప్లానింగ్‌ మేకప్‌ గురించి ఎక్కువ చర్చ జరిగేది అని తెలిపారు.