శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 28 డిశెంబరు 2020 (20:35 IST)

మమ్ముట్టి కొత్త అవతారం.. ఏసుదాస్ బయోపిక్‌లో నటిస్తారా?

Mammootty
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కొత్త అవతారం ఎత్తారు. కేరళలోని కొచ్చిలో కొత్త మేయర్‌గా ఎన్నికైన అనిల్ కుమార్.. ఇటీవల మమ్ముట్టిని ఆయన ఇంటిలో కలిశారు. ఈ విషయాన్ని అనిల్ తన ఫేస్‌బుక్‌లో వెల్లడించాడు. మమ్ముట్టిని కలిసి ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నా. సిటీ, ఆర్ట్స్, సినిమాతో పాటు మిగిలిన విషయాలపై మేమిద్దరం చాలా సేపు మాట్లాడుకున్నాము అని కామెంట్ పెట్టారు. ఇక ఈ ఫొటోలో వైట్ కుర్తా, గడ్డంతో కనిపించాడు మమ్ముట్టి. 
 
ఆ ఫొటోలో మమ్ముట్టి తన సింప్లిసిటీతో మరోసారి అందరినీ ఆకట్టుకోగా.. కాస్త లెజండరీ సింగర్ ఏసుదాసులా కనిపిస్తున్నారు. దీంతో మెగాస్టార్ ఏసుదాసులా ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ ఏడాది షైలాక్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మమ్ముట్టి.. ప్రస్తుతం ద ప్రీస్ట్‌, వన్ సినిమాల్లో నటిస్తున్నారు. తాజాగా మమ్ముట్టి లుక్‌తో ఆయన ఏసుదాస్ బయోపిక్‌లో నటిస్తారా అనే చర్చ మొదలైంది. 
 
ఇకపోతే.. మమ్ముట్టి ఆరు భాషల్లో 400కు పైగా చిత్రాల్లో నటించారు. జాతీయ అవార్డుతో పాటు పలు అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. అంతేకాదు పాత్ర ఏదైనా అందులో ఒదిగిపోయే ఈ నటుడు.. మలయాళ మెగాస్టార్‌గా గుర్తింపు పొందారు. 
 
ఇక ఇప్పటికీ తన స్టైల్‌, నటనతో యువ హీరోలకు ఆయన పోటీ ఇస్తున్నారు. ఇక స్వాతి కిరణం, యాత్ర మూవీలతో తెలుగు వారికి కూడా మమ్ముట్టి చాలా దగ్గరయ్యారు. ఈ రెండు మూవీలు ప్రేక్షకులను మెప్పించడంతో పాటు మంచి కలెక్షన్లు కూడా రాబట్టిన సంగతి తెలిసిందే.