ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 12 ఆగస్టు 2022 (13:45 IST)

కొణిదెల ఇంట పెళ్లి సందడి: యాంకర్ మేఘనను పెళ్లాడనున్న పవన్ తేజ్

Konidela Pawan Tej
Konidela Pawan Tej
కొణిదెల ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆ కుటుంబం నుంచి ఫిలిం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మరో నటుడు పవన్ తేజ్ ఓ ఇంటివాడు అవుతున్నాడు. సినీ నటి, బుల్లితెర యాంకర్ మేఘనను ఆయన పెళ్లాడబోతున్నాడు. 
 
వీరి నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకకు చిరంజీవి భార్య సురేఖ, సినీ దర్శకుడు మెహర్ రమేశ్, నటుడు రాజీవ్ కనకాల, యాంకర్ సుమ తదితరులు హాజరయ్యారు.
 
ఈ సందర్భంగా పవన్ తేజ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందిస్తూ... ప్రేమతో తమ ప్రయాణం మొదలైందని... ఆమె వల్లే ప్రేమ అంటే ఏమిటో తనకు అర్థమయిందని చెప్పాడు. 
 
ఇక పవన్ తేజ్, మేఘన ఇద్దరూ 'ఈ కథలో పాత్రలు కల్పితం' సినిమాలో నటించారు. ఈ సినిమా సమయంలోనే ఇద్దరికీ పరిచయం కలిగింది. అది కాస్తా ప్రేమకు దారితీసింది. ఇప్పుడు వీరిద్దరూ పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుంటున్నారు.