బావ వరుసైన పోసాని పని రాక్షసుడు.. అక్కడే ఫుడ్డూ, బెడ్డూ: కొరటాల శివ

''మిర్చి'', ''శ్రీమంతుడు'', ''జనతా గ్యారేజ్'' చిత్రాలతో టాప్ డైరెక్టర్స్ జాబితాలో చేరిపోయిన డైరెక్టర్ కొరటాల శివ. ఇటీవల జనతా సక్సెస్ ప్రమోషన్లలో పాల్గొన్న కొరటాల తాను ఎలా ఇండస్ట్రీకి వచ్చాడో, ఇలా ఎదగ

posani krishna murali
chitra| Last Updated: మంగళవారం, 6 సెప్టెంబరు 2016 (17:41 IST)
''మిర్చి'', ''శ్రీమంతుడు'', ''జనతా గ్యారేజ్'' చిత్రాలతో
టాప్ డైరెక్టర్స్ జాబితాలో చేరిపోయిన డైరెక్టర్ కొరటాల శివ. ఇటీవల జనతా సక్సెస్ ప్రమోషన్లలో పాల్గొన్న కొరటాల తాను ఎలా ఇండస్ట్రీకి వచ్చాడో, ఇలా ఎదగడానికి కారణమెవరో, ఎవరి దగ్గర పనిచేసాడో వంటి ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. ఈ దర్శకుడు బీటెక్ పూర్తి కాగానే బావ వరుస అయినా పోసాని కృష్ణ మురళి దగ్గర 1998లో జాబ్ చేసుకుంటూ అసిస్టెంటుగా చేరాడట.

రోజుకో మూడు నాలుగు గంటలు పడుకుంటే చాలు అనేవాడట పోసాని.. ఎప్పుడు కథలు రాస్తూ పోసాని ఆఫీస్‌లోనే తింటూ, పడుకుంటూ ఉండేవాళ్లమని చెప్పుకొచ్చాడు. 1998 రోజుల్లోనే నెలకు పాతికవేలు జీతంగా ఇచ్చేవారు. అప్పట్లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు కూడా రూ.10 వేల జీతం ఇచ్చే వాళ్లు కాదు. అప్పట్లో అన్ని డబ్బులు ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. మెస్ కార్డు రూ.600 ఉండేది.

పోసానిగారి ఆఫీసులోనే ఉండేవాళ్లం. ఆయన దగ్గర పని చేసినన్నాళ్లూ కష్టం ఉండేది కానీ.. ఆర్థిక ఇబ్బందులైతే ఏమీ ఉండేవి కావు. ఆయన పని రాక్షసుడు. ఆ కష్టం.. ఆ అనుభవం ఇప్పుడు ఎంతో ఉపయోగపడుతోందని తన మనసులోని మాటను బయటపెట్టాడు కొరటాల.దీనిపై మరింత చదవండి :