శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By TJ
Last Modified: బుధవారం, 2 మే 2018 (21:25 IST)

పోసాని క్రిష్ణమురళికి అది ఉన్న మాట వాస్తవమే - కొరాటాల శివ

ఒరేయ్.. కొరటాల శివ. మంచి సినిమా తీశావురా.. ఈ విజయం నీ ఒక్కడిదేరా.. నువ్వు ఏ సినిమా తీసినా అదుర్స్ రా.. ఇలా ప్రతి పదం వెనుకల రా అంటూ దర్శకుడు కొరాటాల శివను ఉద్దేశించి పోసాని క్రిష్ణమురళి వ్యాఖ్యలు చేశారు. అది కూడా ఎక్కడో కాదు భరత్ అను నేను సక్సెస్ మీట

ఒరేయ్.. కొరటాల శివ. మంచి సినిమా తీశావురా.. ఈ విజయం నీ ఒక్కడిదేరా.. నువ్వు ఏ సినిమా తీసినా అదుర్స్ రా.. ఇలా ప్రతి పదం వెనుకల రా అంటూ దర్శకుడు కొరాటాల శివను ఉద్దేశించి పోసాని క్రిష్ణమురళి వ్యాఖ్యలు చేశారు. అది కూడా ఎక్కడో కాదు భరత్ అను నేను సక్సెస్ మీటింగ్ లోనే. కొరటాల శివను అలా మర్యాద లేకుండా మాట్లాడటంతో మహేష్ అభిమానులు ఆశ్చర్యపోయారు. పోసాని క్రిష్ణమురళి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో అర్థం కాలేదు.
 
తన ప్రసంగం చివరలో పోసాని క్రిష్ణమురళి అసలు విషయం చెప్పాడు. తనకు కొరాటాల శివ బంధువని, చిన్నతనం నుంచి తన ఇంట్లోనే పెరిగాడని, తన కొడుకుతో సమానంగా కొరాటాల శివను చూస్తానని చెప్పారు. ఆ తరువాత ఇదే విషయంపై మొదటిసారి కొరాటాల శివ స్పందించారు. పోసాని క్రిష్ణమురళి నాకు తండ్రితో సమానం.
 
ఆయనకు కాస్త తిక్క ఉన్న విషయం తెలిసిందే. నేను అది ఒప్పుకుంటాను. కానీ ఆవేశం ఎక్కువ. ఆలోచిస్తాడు కూడా. అందుకే పోసాని క్రిష్ణమురళి అంటే నాకు చాలా ఇష్టం అన్నారు. ఆయన ఏం మాట్లాడినా పట్టించుకోనని, అందరూ కలిసికట్టుగానే ఉంటామన్నారు కొరటాల శివ. భరత్ అనే నేను సినిమా ఫంక్షన్ తరువాత పోసాని క్రిష్ణమురళి, నాకు మధ్య గ్యాప్ పెరిగిందన్న వస్తుందన్న ప్రచారాన్ని కొరటాల శివ కొట్టిపారేశారు.