శనివారం, 8 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 7 నవంబరు 2025 (15:43 IST)

గోవా బీచ్‌లో విదేశీ యువతులను అసభ్యంగా తాకుతూ స్థానిక యువకులు (video)

youths inappropriately touching foreign girls
కర్టెసి-ట్విట్టర్
విదేశీ పర్యాటకులు బెంబేలెత్తించే పనులు చేస్తున్నారు గోవాలోని స్థానిక యువకులు. విదేశీ పర్యాకులు వస్తే చాలు వారిని తమ చేష్టలతో వేధిస్తున్నారు. గోవా సముద్ర తీరానికి విదేశీ యువతులు వ్యాహ్యాళికి వచ్చారు. వారు అలా బీచ్ ఒడ్డున తిరుగుతున్న సమయంలో కొందరు యువకులు వారిని చుట్టుముట్టారు. 
 
వారిని తాకరాని చోట తాకుతూ మెడపైన చేతులు వేస్తూ ఫోటోలు దిగేందుకు ప్రయత్నించారు. విదేశీ యువతులు ఎంతగా వద్దని వారించినా యువకులు ఎంతమాత్రం పట్టించుకోలేదు. చేతులు వేసి వారిని దగ్గరకు లాక్కుంటూ ఫోటోలు దిగారు. ఈ వ్యవహారాన్నంతా ఓ యువకుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ఈ వీడియోను చూసిన పోలీసులు వెంటనే దర్యాప్తు మొదలుపెట్టారు.