శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 29 ఆగస్టు 2022 (17:28 IST)

నేను హైదరాబాదులో.. రమ్యకృష్ణ చెన్నైలో.. అప్పుడప్పుడూ..

ramyakrishna
ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ తాజాగా తెరకెక్కిస్తున్న సినిమా 'రంగమార్తాండ'. "నక్షత్రం" మూవీ దాదాపు ఐదేళ్ల గ్యాప్‌ తర్వాత డిఫరెంట్ కాన్సెఫ్ట్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు కృష్ణవంశీ. ఈ సినిమాలో రమ్యకృష్ణ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం విడుదలకు సిద్ధం కానుంది. 
 
ఈ నేపథ్యంలో వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న ఆయన సినిమాకు సంబంధించిన విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలను తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'రమ్యకృష్ణ రేంజ్‌ని మ్యాచ్ చేయాలనే టెన్షన్ తనకు వుంద్నకు ఉంటుంది. తనకు ఆమెతో కాంపిటిషన్ ఉంటుంది. 
 
కొడుకుతో కలిసి రమ్యకృష్ణ చెన్నైలో ఉంటోంది. తానేమో హైదరాబాద్‌లో ఉంటున్నా. ఎప్పుడూ ఖాళీ దొరికినా తాను అక్కడికి వెళ్తుంటా. లేదా వాళ్లే తన దగ్గరికి వస్తుంటారు. ఇక మా అబ్బాయి రిత్విక్‌ చాలా యాక్టివ్‌. ఎంతైనా క్రాస్‌బ్రీడ్‌ కదా అంటూ చెప్పుకొచ్చారు. 
 
ఇక రమ్యకృష్ణ, మీరు వేర్వేరుగా ఉంటే పుకార్లు వస్తుంటాయి కదా అని అడగ్గా.. అలాంటివి తాము పట్టించుకోమని, ఇండస్ట్రీలో ఇలాంటి గాసిప్స్‌ కామన్‌' అని తెలిపారు.