గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 20 ఆగస్టు 2022 (13:15 IST)

నరేష్, పవిత్ర లోకేశ్ మేజర్స్.. వారి జీవితాన్ని హ్యూమిలేట్ చేయడం...

naresh - pavithra
ప్రముఖ నటి మిర్చి మాధవి పవిత్ర లోకేశ్, నరేష్‌లపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. లైఫ్‌లో కామెడీ షోలోగా వాళ్లపై వీళ్లపై కామెడీ చేయడం నచ్చదని ఆమె తెలిపింది. పవిత్ర లోకేశ్, నరేష్‌ల గురించి మనం ఏ విధంగా జడ్జ్ చేయగలమని ఆమె కామెంట్లు చేశారు. నరేష్, పవిత్ర లోకేశ్ మేజర్స్ అని వాళ్ల వ్యక్తిగత జీవితాలను అంత హ్యూమిలేట్ చేయడం ఎందుకని మిర్చి మాధవి అన్నారు.
 
బయట చాలామంది చాలా చేస్తున్నా వాళ్ల గురించి బయటకు రావడం లేదు కదా అని మిర్చి మాధవి ప్రశ్నించారు. నరేష్, పవిత్రల ఏముందో వాళ్లకు తెలుసని.. వాళ్ల సమస్యలు ఏంటో వాళ్లకు తెలుసని ఆమె తెలిపింది.  
 
ఈరోజుల్లో థియేటర్లలో సినిమా చూడటం కష్టమైన టాస్క్ అయిందని ఆమె తెలిపారు. తన నుంచి ఎవరికీ ఇబ్బంది కలగకూడదని తాను భావిస్తానని ఆమె కామెంట్లు చేసింది. శతమానం భవతి మూవీ సమయంలో తన ఫ్రెండ్ ఒకరు డిఫరెంట్‌గా బిహేవ్ చేశారని ఆమె తెలిపారు. గేలి చేయడం, వెకిలి చేయడం తనకు నచ్చదని ఆమె చెప్పుకొచ్చింది. తాను ఎవరిపై ప్రాక్టికల్ జోక్స్ వేయనని వెల్లడించింది.