గురువారం, 14 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 14 ఆగస్టు 2025 (11:29 IST)

యూపీలో ఘోరం- రక్షాబంధన్ రోజే 14 ఏళ్ల చెల్లిపై అత్యాచారం.. ఆపై హత్య

Victim
Victim
యూపీలో ఘోరం జరిగింది. రక్షాబంధన్‌ రోజే చెల్లి వరుసైన బాలికపై అత్యాచారం చేసి అనంతరం హత్య చేశాడో కామాంధుడు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని ఔరయ్యకు చెందిన 33 ఏళ్ల సుర్జీత్‌ అనే వ్యక్తికి 14 ఏళ్ల బాలిక వరుసకు చెల్లి అవుతుంది. రక్షాబంధన్‌ రోజున బాధితురాలు అతనికి రాఖీ కట్టింది. 
 
అదే రాత్రి, బాగా మద్యం తాగిన  ఇంటికి వెళ్లాడు. గదిలో నిద్రపోతున్న 14 ఏళ్ల బాలికపై సుర్జీత్‌ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమెను చంపి, మృతదేహాన్ని ఉరికి వేలాడదీశాడు. ఆమె తండ్రి ఇంట్లో వేరే గదిలో నిద్రిస్తుండటంతో పాపం ఈ విషయం అతనికి తెలియకుండా పోయింది. 
 
మరుసటి రోజు  సుర్జీత్‌ ఈ విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంటికి చేరుకున్న పోలీసులకు అనేక చోట్ల రక్తపు మరకలు కనిపించడంతోనే అది ఆత్మహత్య కాదని తేల్చేశారు. 
 
సుర్జీత్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా నేరాన్ని అంగీకరించాడు. బాధితురాలి గోళ్లు, చేతిలో ఉన్న సుర్జీత్‌ వెంట్రుకల నమూనాలతో నిందితుడిని పట్టుకున్నారు.