గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 18 ఆగస్టు 2022 (15:06 IST)

అందుకే మహానటి నుంచి ఆమెను తీసేశాం.. అశ్వనీదత్

Mahanati
ఆలీతో సరదాగా షోకు ముఖ్య అతిథిగా వచ్చారు ప్రముఖ నిర్మాత అశ్వనీదత్. ఈ సందర్భంగా టాలీవుడ్‌ ప్రముఖుల గురించి చెప్పుకొచ్చారు. అలాగే మెగాస్టార్ చిరంజీవితో ఆయనకు ఉన్న అనుబంధం గురించి కూడా ప్రస్తావించారు. ఇండస్ట్రీ బిగ్ హిట్ మహానటి సినిమా టైంలో జరిగిన గొడవ గురించి కూడా రివీల్ చేశారు. 
 
వాస్తవానికి మహానటి సినిమాకు మొదట అనుకున్నది కీర్తి సురేష్‌ను కాదట. ఆమె స్థానంలో ఓ మలయాళీ ముద్దుగుమ్మను అనుకున్నారట. ఆమె కూడా ఓకే చెప్పిందట. 
 
కానీ, సినిమాలో మద్యం తాగే సీన్స్ ఉంటే చేయను అని స్క్రిప్ట్‌లో చేంజస్ చేయమని అడిగిందట. దీంతో అశ్వీని దత్‌కు కోపం వచ్చి ఆమెను సినిమాలో నుంచి తీసేశారట. 
 
స్క్రిప్ట్‌లో మార్పులు చేయమనడానికి ఆమె ఎవరు.. అందుకే నేనే సినిమాలో నుండి తీసేశాననంటూ చెప్పుకొచ్చారు అశ్వనీదత్. ప్రస్తుతం అశ్వనీదత్ మహానటిపై చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతోంది.