శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి
Last Updated : గురువారం, 19 సెప్టెంబరు 2019 (18:37 IST)

మంచు లక్ష్మీ కొత్త షో.. నైట్ డ్రస్‌లో.. అక్కడ అలాంటివి కామన్

మంచు లక్ష్మీ ఇప్పటికే చేసిన బుల్లితెర షోలు చాలా సక్సెస్ అయ్యాయి. యాక్టర్‌గా, టెలివిజన్ హోస్ట్‌గా, నిర్మాతగా, ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో యాక్టర్‌గా ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న లక్ష్మి తాజా ఒక కొత్త షోకు హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారు. సంప్రదాయ షోలకు భిన్నంగా ఓ అడుగు ముందుకు వేసి హాట్‌ హాట్ కబుర్లతో మంచి ఆసక్తికరమైన అనుభవాలు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు.
 
పలు రంగాల్లో ప్రతిభను చాటుకొంటున్న మంచు లక్ష్మి హోస్ట్‌గా బెడ్ టైమ్ స్టోరీస్ తెలుగులో ప్రసారమవనుంది. సింపుల్‌గా చెప్పాలంటే వీటీని ‘బెడ్ టైమ్ స్టోరీస్' అనుకోవచ్చు. ఈ షో సెప్టెంబర్ 23 తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో మంచు లక్ష్మీ మాట్లాడుతూ.. డిజిటల్ మీడియా సరికొత్త హంగులను దిద్దుకుంటోంది. ఎంటర్‌టైన్మెంట్ పరిధులు పెంచుతూ వినోదాన్ని మరోస్థాయికి తీసుకెళ్తోంది. అలాంటి వూట్ అప్ ప్రెజెంట్స్ చేస్తున్న 'ఫీట్ అప్ విత్ ద స్టార్' తెలుగు వర్షన్‌కి మంచు లక్ష్మీ హోస్ట్‌గా చేయడానికి ఒప్పుకున్నారు.
 
ఇప్పటి వరకూ నేను చేసిన కార్యక్రమాలలో ఈ 'ఫీట్ అప్ విత్ ద స్టార్స్' భిన్నమైనది. ఈ షో కోసం సెలబ్రిటీలను నైట్ డ్రెస్‌లో రమ్మంటే వారిలో కొందరు ఆశ్చర్యపోగా మరికొందరు ఉత్సాహం చూపించారు. బాలీవుడ్‌లో ఈ తరహా షోలు ఉన్నప్పటికీ తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఇది కొత్తది. వాళ్ళ పర్సనల్ విషయాలు ఈ షో తో తెలుస్తాయి. ఇందులో కాంట్రవర్సీలకు ఆస్కారం లేదు అని మంచు లక్ష్మీ అన్నారు.
 
హీరో, హీరోయిన్లు నా మీద పెట్టుకున్న భరోసా‌ను చెరగనివ్వకుండా వారిని ఇంట్రెస్టింగ్‌గా ఇంటర్వ్యూలు చేసాను. మనకు సెలబ్రిటీల గురించి చాలా విషయాలు తెలుసనుకుంటాం, కానీ అది అబద్ధం. ఉదాహరణకు సమంత గురించి మనకు చాలా తెలుసు అనుకుంటాం.. కానీ నాగ చైతన్య గురించి ఈ షోలో మాట్లాడిన విషయాలు మీకు కొత్తగా ఉంటాయి. అలాగే వరుణ్ తేజ్ ఈ షోలో కొత్తగా ఉంటారు. ప్రతి సోమవారం ఒక్కో ఎపిసోడ్ ప్రారంభం కానుందని తెలిపారు.