శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Updated : బుధవారం, 18 సెప్టెంబరు 2019 (12:33 IST)

సెలబ్రిటీస్ బెడ్ స్టోరీస్‌తో వస్తున్నా-మంచులక్ష్మి (video)

సెలబ్రిటీస్ అంటే చాలామంది ఇష్టపడతారు. సినిమాల్లోనో లేక టివిల్లోనో వాళ్లను చూసి అభిమానిస్తుంటారు. ముఖ్యంగా సినిమా స్టార్స్ అంటే చాలామందికి ఓ ఆరాధనాభావం కూడా ఉంటుంది. తమ అభిమాన నాయకుడు/నాయకిలు ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఏం చేస్తుంటారా అని ఆలోచిస్తుంటారు. మామూలుగా డే టైమ్ మేటర్స్ చాలా వరకూ తెలిసిపోతుంటాయి. కానీ సెలబ్రిటీస్ నైట్ లైఫ్ ఎలా ఉంటుంది. వాళ్లు బెడ్‌‌పైకి చేరిన తర్వాత వాళ్ల ఆలోచనా విధానం ఎలా ఉంటుంది.
 
 ఆ రోజంతా వారికి ఎలా గడిచింది.. ఇలాంటి అంశాలతో పాటు.. ఇప్పటి వరకూ ఎవరికీ చెప్పని, తెలియని విషయాలను కూడా తెలసుకోవాలనుకునే అభిమానులు చాలానే ఉంటారు. అలాంటి వారికోసం బాలీవుడ్‌లో ఫూట్ అప్ విత్ స్టార్స్ అంటూ ఓ క్రేజీ షో వస్తోంది. కాస్త ఫన్, క్రేజీ, ఇంకాస్త హాట్‌‍గా ఉండే ఎన్నో విషయాలను వాళ్లు ఈ ఫూట్ అప్ విత్ స్టార్స్‌‍లో షేర్ చేసుకుంటుంటారు.
 
ఇప్పుడు తెలుగులోనూ అలాంటి స్పైసీ షో రాబోతోంది. టాలెంటెడ్ యాక్ట్రెస్ మంచు లక్ష్మి హోస్ట్‌గా ఈ షో త్వరలోనే తెలుగులో ప్రసారం కాబోతోంది. సింపుల్‌గా చెబితే వీటిని బెడ్ టైమ్ స్టోరీస్ అనుకోవచ్చు. లేదా బెడ్ టైమ్ ఇంటర్వ్యూ అని కూడా అనుకోవచ్చు. 
 
సెలబ్రిటీస్‌తో మాట్లాడుతూ.. ఆ టైమ్‌లో వారి ఫీలింగ్స్‌ను ఆడియన్స్‌కు తెలిసేలా మంచు లక్ష్మి ఈ షోను మరింత క్రేజీగా హోస్ట్ చేసేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటి వరకూ తెలుగులో ఎన్నడూ రానటువంటి షోగా ఇది మారుతుందని బాలీవుడ్ షోస్ చూసిన ఎవరికైనా అర్థమౌతుంది. వయాకామ్ 18వాళ్లు నిర్వహిస్తోన్న ఈ  షోకు హోస్ట్‌గా చేసే అవకాశం వచ్చినందుకు మంచు లక్ష్మి మాట్లాడుతూ.. ఫూట్ అప్ విత్ స్టార్స్ తెలుగు వెర్షన్ హోస్ట్ చేస్తున్నందుకు చాలా ఎగ్జైటింగ్‌గా ఫీలవుతున్నారు. ఈ షో ఫార్మాట్ చాలా యూనిక్ గా ఉంది. 
 
మన అభిమాన సెలబ్రిటీస్ ఫీలింగ్స్‌ను, సీక్రెట్స్‌ను తెలుసుకునేందుకు ఇది ఓ పర్ఫెక్ట్ సెట్టింగ్. తమ అభిమాన తారలను అభిమానులకు చాలా దగ్గరగా చేస్తూ చాలా ఫన్‌గా ఈ షో ఉండేలా ప్రయత్నిస్తాను. సెలబ్రిటీస్‌లో నాకు చాలామంది ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వాళ్లందరితోనూ చేసే సంభాషణల కోసం నేనూ ఎంతో ఆసక్తిగా చూస్తున్నాను. నాకే కాదు.. సెలబ్రిటీస్ కు కూడా ఇదో ఇంట్రెస్టింగ్ ఎక్స్ పీరియన్స్ మారబోతోంది. ఈ షో కోసం చాలా వెయిట్ చేస్తున్నాను అని మంచు ల‌క్ష్మి అన్నారు. 
 
ఈ నెల 23 నుంచి ప్రారంభం కాబోతోన్న ఈ షోకోసం ఇప్పటికే చాలామందికి నచ్చే తారలతో ఇంటర్వ్యూస్ సిద్ధంగా ఉన్నాయని.. ఇలాంటి సెన్సేషనల్ షో కోసం మీకూ బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాం అని వయాకామ్ 18 ప్రతినిధులు చెప్పారు. మ‌రి.. ఈ షోకి  వ్యూవ‌ర్స్ నుంచి ఎలాంటి ఆద‌ర‌ణ ల‌భిస్తుందో చూడాలి.