నటుడు శరత్ బాబు ఆరోగ్యం విషమం?
తెలుగు చిత్రపరిశ్రమకు సీనియర్ నటుడు శరత్ బాబు అనారోగ్యానికి గురయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయన్ను హైదరాబాద్ నగరంలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.
తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న నటుడు శరత్ బాబు ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. గత కొంతకాలంగా బెంగళూరులో చికిత్స పొందుతోన్న ఆయన్ను మెరుగైన వైద్యం కోసం కుటుంబసభ్యులు శుక్రవారం హైదరాబాద్ తీసుకువచ్చారు.
నగరంలోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఐసీయూ నుంచి సాధారణ గదికి తరలించి చికిత్స కొనసాగిస్తున్నట్లు తెలిపారు.